DAY 2 GRAND TEPPOTSAVAM AT TIRUMALA_ తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

Tirumala, 26 February 2018: As part of the annual Teppotsavam, on Day-2, Lord Malayappaswamy will give darshan to devotees as Rukmini sameta Sri Krishna Swamy on the colorfully decorated float at the Swami Pushkarini.

Earlier the utsava idols of Swamy and Ammavaru were paraded grandly on the Srivari temple Mada streets and brought to the Srivari Pushkarini. Later on the float decorated with bright flowers and colorful lights they went around the Pushkarini thrice and blessed the devotees.

On the Day-3 tomorrow the utsava idols of Sri Malayappaswamy along with His consorts Sridevi and Bhudevi will be taken on the float for three rounds to bless the devotees who throng Tirumala to witness the annual Teppotsavam.

TTD Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, DyEO Sri Harindranath and other officials participated in the event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

ఫిబ్రవరి 26, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.

కాగా, మూడవరోజు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చినెక్కి సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. 

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.