DAY 2- SHODASHA DINA SUNDARKANDA DIKSHA _ వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణం

Tirumala, 4 May 2021: The spiritual campaign of TTD for global well-being from pandemic Corona, the Shodasha Dina Sundarakanda Diksha entered the second day at the Vasantha Mandapam on Tuesday with the parayanam of 152 shlokas of 3-6 sargas by TTD Vedic pundits.

As per tradition, the second-day parayanams was focused on the ‘Gha’ word in 52 shlokas of sarga 3, 29 shlokas of sargas 4, 27 of sarga 5 and 44 shlokas of sarga 6.

After the daily Sankalp, the pundits chanted the mantras from Sri Rama Prarthana, Sri Anjaneya Prarthana and Sri Valmiki Prarthana.

Tomorrow, on Wednesday, May 5, the pundits will perform Diksha parayanams of 153 shlokas from Sargas 7-10 of Sundarakanda.

While 16 Veda pundits under supervision of Sri KSS Avadhani, principal of Dharmagiri Veda Pathashala conducted Shodasha Sundara Kanda Diksha at Vasantha Mandapam, 16 other Pundits performed Japam- Tarpana-homas at Dharmagiri Veda Pathashala.   

TTD has organised a live telecast by SVBC of the entire Diksha program from 08.30 am for benefit of Srivari devotees across the world.

The TTD additional EO Sri AV Dharma Reddy couple, Health Officer Dr RR Reddy, Dr A Vibhishana Sharma OSD of SV Institute of higher Vedic Studies and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ పారాయ‌ణం

తిరుమల, 2021 మే 04: లోక సంక్షేమం కోసం శ్రీ‌వారిని ప్రార్థిస్తూ వ‌సంత మండ‌పంలో నిర్వ‌హిస్తున్న‌ షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌లో భాగంగా రెండ‌వ రోజైన మంగ‌ళ‌వారం ఉద‌యం మూడ‌వ స‌ర్గ నుండి ఆర‌వ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 152 శ్లోకాల‌ను  వేద శాస్త్ర‌ పండితులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయ‌ణం చేశారు.

షోడ‌షాక్ష‌రి మ‌హామంత్రం ప్ర‌కారం రెండ‌వ‌ రోజు ఘ‌ అనే అక్ష‌రానికి ఉన్న బీజాక్ష‌రాల ప్ర‌కారం సుంద‌ర‌కాండ‌లోని 3వ‌ స‌ర్గ‌లో 52, 4వ స‌ర్గ‌లో 29, 5వ స‌ర్గ‌లో 27, 6వ స‌ర్గ‌లో 44 క‌లిపి మొత్తం 152 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. ఇందులో భాగంగా మొద‌ట సంక‌ల్పంతో ప్రారంభించి శ్రీ‌రామ ప్రార్థ‌న‌, శ్రీ ఆంజ‌నేయ ప్రార్థ‌న‌, శ్రీ వాల్మీకి ప్రార్థ‌న చేశారు. బుధ‌వారం నాడు 7వ‌ స‌ర్గ నుండి 10వ‌ స‌ర్గ వ‌రకు మొత్తం 153 శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌నున్నారు.

ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో వ‌సంత మండ‌పంలో 16 మంది వేద శాస్త్ర‌ పండితులు ప‌రాయ‌ణం చేశారు. అదేవిధంగా ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాలలో మ‌రో 16 మంది వేద శాస్త్ర‌ పండితులు జ‌ప – త‌ర్ప‌ణ – హోమాదులు నిర్వ‌హించారు.    

ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఆరోగ్య‌శాఖాధికారి డా.ఆర్ఆర్‌.రెడ్డి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.