DEEPA LAKSHMI NRITYAM-KATTI NATYAM ENTHRALLS
TIRUPATI, 17 NOVEMBER 2025: The ongoing annual Karthika Brahmotsavams at Tiruchanoor witnessed a galaxy of colourful performances by various dance troupes.
The pleasant evening on Monday has become a platform for different unique dance forms including Deepa Nrityam, Katti Natyam besides folk dances like Gussadi, Batukamma, Chekka Bhajana in front of Chinna Sesha Vahanam.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సాంస్కృతిక శోభ
తిరుపతి, 2025 నవంబరు 17: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వాహన సేవల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
చిన్న శేష వాహనంలో భాగంగా సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రం నుండి గుస్సాడి, బతుకమ్మ, చెక్కభజనలతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అదేవిధంగా, తిరుపతి ఎస్వీ మ్యూజిక్ కాలేజీ నుండి నృత్యం, కత్తి నాట్యం, రాజమండ్రి నుండి నెమలి డ్యాన్స్, అన్నమాచార్య ప్రాజెక్టు నుండి కోలాటం, కూచిపూడి నృత్యం, HDPP నుండి సాంప్రదాయ పాఠశాల కళాకారులు దీపలక్ష్మీ నృత్యం, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి విజయవాడ కు చెందిన కోలాటం, కర్నాటక నుండి పద్మావతీ కల్యాణం భరత నాట్యం ఆకట్టుకున్నాయి.










