DEEPAVALI ASTHANAM IN TIRUMALA TEMPLE ON OCTOBER 27 _ అక్టోబ‌రు 27న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Tirumala, 18 Oct. 19: Deepavali Asthanam in connection with the festival of light will be observed in Tirumala temple on October 27.

As a part of the ritual, the utsava deities of Sri Malayappa Swamy along with His two consorts, Sridevi and Bhudevi will be seated in Sarvabhoopala Vahanam in Ghanta Mandapam facing Garudalwar. On the left side Sri Vishwaksenulavaru is seated and then the temple court is performed.

TTD has cancelled arjitha sevas following this fete on the day.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబ‌రు 27న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబ‌రు 27వ తేదీన‌ ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి ఉదయం 9 గం||ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా అక్టోబ‌రు 27న క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం, వ‌సంతోత్స‌వం ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.