DEEPAVALI ASTHANAM OBSERVED IN TIRUMALA TEMPLE_ శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం

Tirumala, 19 Oct. 17: The auspicious festival of Deepavali Asthanam was observed in Tirumala temple in a religious manner on Thursday.

After the traditional temple court to the processional deities of Sri Malayappa, Sridevi, Bhudevi and Viswaksenulavaru in Bangaru Vakili Harati was rendered and prasadam were distributed.

Speaking on this occasion, In-charge EO Sri KS Sreenivasa Raju said, Deepavali is one of the important Hindu festivals which is celebrated in a big way with spiritual fervour. He wished that the devotees of Lord Venkateswara have a happy and prosperous Diwali.

Temple DyEO Sri Rama Rao, Parpathyedar Sri Ramachandra, Sri Gururaja Rao, Sri Seshadri, VGO Sri Raveendra Reddy and others took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం

అక్టోబరు 19, తిరుమల, 2017: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం ఘనంగా జరిగింది. ఉదయం 7 నుండి ఉదయం 9 గం||ల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం చేపట్టారు. ఈ సందర్భంగా టిటిడి ఇన్ చార్జి ఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మాట్లాడుతూ దీపావళి నాడు స్వామివారి ఆశీస్సులతో భక్తులందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలోనికి వేంచేపు చేశారు. ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామిని బంగారువాకిలి ముందు ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారులకు అభిముఖంగా కొలువుదీర్చారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేశారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తయింది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ కోదండరామారావు, పార్ పత్తేదార్ శ్రీ రామచంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.