DEITIES CHARM ON SURYA PRABHA IN SRI KT BTUs _ సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి క‌టాక్షం

Tirupati, 15 Feb. 20: The processional deities of Sri Somskanda Murty flanked by Sri Kamakshi Devi charmed devotees on the bright Suryaprabha Vahanam on the sunny day on Saturday.

The deities roamed along the streets to bless the devotees who lined up to give Haratis. 

The beauty of the vahanam procession enhanced with the red ixora garlands decorated to the deities and vahanam. 

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati, Temple Inspectors Sri Reddy Sekhar, Sri Srinivasa Naik and other office staff were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి క‌టాక్షం

 ఫిబ్రవరి 15, తిరుపతి, 2020: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ‌నివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను క‌టాక్షించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ సాగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, భజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నాడు.

అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

చంద్రప్రభ వాహనం

రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.
 

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.