DEITIES ELATE ON BED OF FLOWERS DURING PUSHPAYAGAM

Appalayagunta, 11 Jul. 17: The processional deities of Sri Prasanna Venkateswara Swamy flanked by Sri Mahalakshmi and Sri Andal Godai graced the devotees who thronged to witness the ceremonial Pushpayagam on Tuesday evening on colourful “Bed of Flowers”.

The annual festival took place in the famous shrine of Appalayagunta between 3pm and 6pm. After offering Tirumanjanam to the utsava murtis in the morning, floral bath was performed to the deities with tones of varieties of traditional and ornamental flowers.

As per the scriptures, this festival is usually performed to save the earth from natural calamities such as quakes, cyclones, epidemics and appease the Lord to save the life of humanity, flora and fauna from all the catastrophes. It is also considered as Sin-free festival akin to Pavitrotsavams.

Tirupati JEO Sri P Bhakar, AEO Sri Radhakrishna, temple Superintendent Sri Gopal Krishna Reddy and other staffs, large number of devotees were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం

తిరుపతి, 2017 జూలై 11: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం పుష్పయాగం వైభవంగా జరిగింది. జూన్‌ 6 నుంచి 14వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మూెత్సవాలు ఘనంగా జరిగాయి. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మూెత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివ త్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీపద్మావతి, శ్రీ ఆండాళ్‌ సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. కాగా సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఏఈవో శ్రీ రాధాక్రిష్ణ, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, ప్రధానార్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.