DEPUTY CM OFFERS SILKS TO GODDESS _ శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి పట్టువస్త్రాల సమర్పణ
TIRUPATI, 30 NOVEMBER 2021: On the occasion of the annual Karthika Brahmotsavams of Sri Padmavathi Devi at Tiruchanoor, the Deputy CM and Minister for Tribal Welfare Smt Pushpa Srivani offered silk vastrams on behalf of the State Government on Tuesday.
She was received and welcomed by JEO Sri Veerabrahmam at the Mahadwaram of the temple.
After presenting Pattu vastrams, she offered prayers to the presiding deity Sri Padmavathi Devi.
Temple DyEO Smt Kasturi Bai and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి పట్టువస్త్రాల సమర్పణ
తిరుపతి, 2021 నవంబరు 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
అనంతరం గౌ|| ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గౌ. శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వివిధ వాహనాలపై వివిధ అలంకారాలలో అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.