DESIGN JOB ORIENTED COURSES FOR SCULPTURE COLLEGE- TTD JEO _ శిల్పకళా శాల విద్యార్థుల ఉపాధికి ఉపయోగపడేలా కోర్సులు
Tirupati, 28 Dec. 21: TTD JEO (Health & Education) Smt Sada Bhargavi has directed officials to design employment-oriented courses for students of the TTD run Sculpture college.
TTD JEO on Tuesday morning visited the SV Sculpture College and interacted with students about courses after going round all departments.
She directed officials to grow flower plants and landscape plantation in the vacant land around the college.
She also advised officials not to throw away unused idols but to showcase them on platforms. She also wanted the idols and paintings by students to be used as gifts to VVIPs visitors to TTD temples and display the art skills of the students to the world.
The JEO also instructed officials to organise an exhibition cum sale event in January at Sculpture College with artefacts created by students to spread awareness among people of the courses and skill sets of outgoing students.
She also said to plan a second exhibition ahead of new admissions in June. The officials and faculty of the college were asked to study feasibility of starting a Bachelor in Architecture course in the college so that after the diploma course students can continue higher studies here itself rather than far off locations.
She also participated in an interactive session with students and enquired about their grievances and amenities etc.
DEO Sri Govindarajan and Principal of the SV Sculpture College Sri Venkata Reddy were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శిల్పకళా శాల విద్యార్థుల ఉపాధికి ఉపయోగపడేలా కోర్సులు
– జనవరిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు కు చర్యలు
టీటీడీ జెఈవో శ్రీమతి సదాభార్గవి
తిరుపతి 28 డిసెంబరు 2021: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శిల్పకళాశాలలో చదివే విద్యార్థులకు ఉపాధికి ఉపయోగపడేలా కోర్సులు ఉండాలని జెఈవో (విద్య మరియు వైద్యం) శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె శిల్పకళాశాలను సందర్శించారు.
కళాశాలలోని వివిధ విభాగాలను పరిశీలించి విద్యార్థులతో కోర్సుల గురించి మాట్లాడారు. కళాశాలలోని ఖాళీ స్థలంలో పూల మొక్కలు పెంచి అందంగా తయారు చేయాలని ఆదేశించారు. ఉపయోగించని విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా, దిమ్మెలు నిర్మించి వాటి మీద ఉంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాల విద్యార్థులు తయారు చేసిన విగ్రహాలు, పెయింటింగ్ లను తిరుమల, తిరుపతి లోని టీటీడీ ఆలయాలు వచ్చే ప్రముఖులకు బహుమతిగా అందించాలన్నారు. దీని వల్ల విద్యార్థుల నైపుణ్యం ప్రపంచానికి తెలుస్తుందని జెఈవో చెప్పారు.
జనవరిలో కళాశాలలోనే ఎగ్జిబిషన్ కం సేల్స్ ప్రదర్శన ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే జూన్ నెలలో అడ్మిషన్లు జరగడానికి ముందు మరో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు.దీనివల్ల కళాశాల గురించి ఇక్కడి కోర్సులు, శిక్షణ, నైపుణ్యం గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందన్నారు. కళాశాలలో డిప్లొమా కోర్సుల తరువాత విద్యార్థులు తదుపరి చదువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటానికి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేయాలని చెప్పారు.
అనంతరం విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, సదుపాయాల గురించి తెలుసుకున్నారు.
విద్యాశాఖ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ గోవింద రాజన్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వెంకట రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది