DEVELOPMENT WORKS AT VONTIMITTA SHOULD COMPLETE BEFORE BTUs-EO_ ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Vontimitta, 2 January 2019: The ongoing developmental works at Sri Kodanda Rama Swamy temple at Vontimitta should complete before the annual brahmotsavams, said, TTD Executive Officer Sri Anil Kumar Singhal.

Along with Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti and CE Sri Chandrasekhar Reddy, the EO inspected the ongoing works at Vontimitta temple in Kadapa district on Wednesday. Later speaking to media persons at temple premises the EO said, under the instructions of Honourable CM of AP, Rs.100crores have been granted towards the development of this ancient temple. So far Rs.17.60crores works have been completed. Another Rs.9crores worth works are under progress.

The EO said, every year Rs.3crores are being spent on the day of Sri Sita Rama Kalyanam. Keeping in view the past experience, a permanent structure will be constructed at Kalyana Vedika with parking and toilet facilities. Action plan has been prepared to construct queue lines, office building, mada streets extension etc. for the sake of devotees.

He said, MoU was signed with ASI to take up repair works for Potu, flooring etc. in temple without disturbing the original structure. Wiring and lighting works in the temple will also be completed soon. To speed up the development works, monthly review meetings will be organised, EO added. We are also giving publicity to enhance visiting pilgrims to this temple and the Time slotted Sarva Darshan system has enabled the visitors to the temple, he observed.

Kadapa SP Sri Abhishek Mohanty, EE Sri Jaganmohan Reddy, DFO Sri Phanikumar Naidu, DSP Sri Raghavendra, ASI Official Sri Sriram, AEO Sri Ramaraju were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఒంటిమిట్ట, 2019 జనవరి 02: టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో రానున్న బ్రహ్మోత్సవాలలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని బుధవారం ఈవో సందర్శించారు. ఆలయ పరిసరాలు, ఉద్యానవన పనులు, పుష్కరిణి, కల్యాణవేదిక ప్రాంతాలను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈవో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు భద్రాచలం తరహాలో ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించామని, ఇప్పటికి రూ.17.60 కోట్లతో పలు పనులను పూర్తి చేశామని, మరో రూ.9 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ప్రతి ఏడాదీ శ్రీరాములవారి కల్యాణానికి రూ.3 కోట్లు ఖర్చవుతోందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన కల్యాణవేదిక, పార్కింగ్‌, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, వేచి ఉండే గదులు, కార్యాలయ భవనం, విశ్రాంతిగృహం త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా పోటు మరమ్మతులు, ఫ్లోరింగ్‌ పనులను భారత పురావస్తు శాఖ చేపట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నామని ఈవో తెలిపారు. ఆలయంలో వైరింగ్‌, లైటింగ్‌ పనులను పూర్తి చేస్తామన్నారు. మాడ వీధుల విస్తరణ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రతినెలా సమీక్షలు నిర్వహించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో టైంస్లాట్‌ సర్వదర్శనం ప్రవేశపెట్టాక, టిటిడి స్థానిక ఆలయాలకు భక్తుల రాక పెరిగిందని, ఇందులో భాగంగా ఒంటిమిట్టకు కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, కడప ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, డిఎస్పి శ్రీ రాఘవేంద్ర, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, ఏఈవో శ్రీ రామరాజు, పురావస్తు శాఖ అధికారి శ్రీ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.