DEVOTEES BEELING TO TIRUMALA ON RATHA SAPTHAMI DAY _ రథసప్తమికి విశేషంగా తరలివచ్చిన భక్తులు
EXPRESS SATISFACTION OVER ARRANGEMENTS
Tirumala, 16 February 2024: All the four mada street galleries were brimming with devotees on Friday as vahanams rolled out as part of Ratha Sapthami celebrations of Srivari temple in Tirumala.
On the ocassion of Surya Jayanti vahanams were held from early morning to late evening and TTD made all arrangements like erection of temporary shades, Annaprasadam, drinking water, toilets and urinals.
Entire hill shrine including srivari temple, main junctions were richly decorated with flowers and electrical lights.
To regulate the heavy rush of devotees 850 vigilance, 700 police, 2900 srivari sevakulu were deployed and SVBC gave live coverage of the entire event for the sake of global devotees.
Among others 25 doctors,50 para medics, two mobile clinics, 5 ambulances, besides four medical teams on four mada streets were positioned.
Following successful and event free conclusion of the mini Brahmotsavam both TTD Chairman and EO complimented employees, staff and devotees.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
రథసప్తమికి విశేషంగా తరలివచ్చిన భక్తులు
• సంతృప్తికరంగా వాహనసేవల దర్శనం
తిరుమల, 2024 ఫిబ్రవరి 16: సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.
చలికి, ఎండకు ఇబ్బందుల్లేకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్లలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వాహనసేవలను తిలకించారు. శ్రీవారి సేవకులు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. షెడ్లకు అనుబంధంగా మరుగుదొడ్లు, మూత్ర విసర్జనశాలలను భక్తులకు అందుబాటులో ఉంచారు. శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 850 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 700 మంది పోలీసుల సేవలను వినియోగించుకున్నారు. 2900 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేశారు.
టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో 10 వేల మంది భక్తులకు 25 మంది డాక్టర్లు, 50 మంది పారామెడికల్ సిబ్బంది వైద్యసేవలందించారు. 2 మొబైల్ క్లినిక్ లు, 5 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లోని నాలుగు మూలల్లో నాలుగు వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు.
టీటీడీ సిబ్బందికి, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు
రథసప్తమి సందర్భంగా వాహనసేవలను తిలకించేందుకు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీల్లో ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, పోలీసులు విశేషంగా సేవలందించారని టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.