DEVOTEES EXPRESSED IMMENSE SATISFACTION OVER TTD ARRANGEMENTS OF DARSHAN-EO TO MEDIA _ డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Tirupati, 12 Jul. 20: The pilgrims are expressing immense satisfaction over the arrangements of Darshan made by TTD, by strictly following COVID 19 guidelines at Tirumala, said TTD EO Sri Anil Kumar Singhal.

After the monthly Dial your EO held at Conference Hall in TTD administrative building in Tirupati, EO Sri Anil Kumar Singhal briefed media on the darshan and other details of the pilgrims ever since TTD resumed darshan of Lord Venkateswara for pilgrims after lockdown from June 11 onwards. 

The EO said tests are being carried out on employees at Alipiri and Tirumala while for pilgrims at Alipiri by taking random samples every day. Details as tabulated below:

 

  • Darshan for pilgrims resumed at Tirumala from 11-06-2020 onwards
  • Data From 11-06-2020 to 10-07-2020 as follows:
  • Darshan :

Mode

Booked

Had darshan 

Absented

Online

2,02,346

1,64,742

55,669

Offline

97,216

85,434

11,782

 

  • Hundi collections: Rs.16.73crore
  • Laddus sold:     13.36lakhs
  • Kalyanakatta:   82,563 

PPE Kits for Tonsurers: 430

  • Tri Ozone Spraying System installed at Tirumala
  • On Sapthagiri Magazine controversy
  • Corona COVID 19 SWAB Tests:

Data up to 10-07-2020

For TTD employees at Tirumala :  1,865

For TTD employees at Alipiri       :1,704

For pilgrims at Alipiri                     :   631

  • Total number of employees who tested positive for Corona 

till 09-07-2020 are 91

  • Random Survey done on pilgrims:

             Date

Number of Pilgrims

Tested Positive

18th June to 25th June

     700

        Nil 

1st July to 7th July

   1943

        Nil

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

తిరుమల, 12 జూలై 2020: తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో ఆదివారం జ‌రిగిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

– కోవిడ్‌-19 నేపథ్యంలో లాక్‌డౌన్‌ సడలించిన తరువాత శ్రీవారి ఆల‌యంలో భక్తుల‌కు దర్శనం ప్రారంభమైన జూన్‌ 11వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.

దర్శనం :

– ఆన్‌లైన్‌ ద్వారా 2,02,346 మంది భక్తులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. 1,64,742 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 55,669 మంది దర్శనానికి రాలేదు.

– తిరుపతిలోని కౌంటర్ల ద్వారా 97,216 మంది భక్తులు దర్శన టోకెన్లు పొందారు. 85,434 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 11,782 మంది దర్శనానికి రాలేదు.

హుండీ ఆదాయం :

– రూ.16.73 కోట్ల హుండీ ఆదాయం భించింది.

ల‌డ్డూ :

– 13.36 ల‌క్షల‌ శ్రీవారి ల‌డ్డూల‌ను భక్తుల‌కు విక్రయించడం జరిగింది.

కల్యాణకట్ట :

– మొత్తం 82,563 మంది భక్తులు తల‌నీలాలు సమర్పించారు.

– 430 మంది క్షురకులు పిపిఇ కిట్లు ధరించి తగిన జాగ్రత్త‌లు పాటిస్తూ భక్తుల‌కు తల‌నీలాలు తీస్తున్నారు.

శ్రీవారి ఆయంలో  ట్రై ఓజోన్‌  స్ప్రేయింగ్‌ సిస్టమ్‌ :

– తిరుమల‌ శ్రీవారి ఆల‌య మహాద్వారం ముందు స్కానింగ్‌ సెంటర్‌ వద్ద, అర్చకులు, ఉద్యోగులు ప్రవేశించే మార్గం వద్ద వ్యాధికారక క్రిముల‌ నుండి ఎలాంటి హాని కల‌గకుండా ట్రైఓజోన్‌ స్ప్రేయింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశాం. ఇందులోని హైడ్రాక్సిల్‌ ఫ్రి ర్యాడికల్‌ ఐయాన్‌ స్ప్రే చేయడం వ‌ల్ల వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయి.

సప్తగిరి మాసపత్రిక :

– సప్తగిరి మాసపత్రిక బట్వాడా సందర్భంగా గుంటూరుకు చెందిన ఒక పాఠకుడికి సప్తగిరితో పాటు అన్యమతానికి చెందిన మరో పుస్తకం బట్వాడా అయినట్లు మా దృష్టికి వచ్చింది. టిటిడి ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొంత మంది చేసిన చర్యగా భావించి పోలీసుల‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పోలీసు విచారణ ప్రారంభమైంది.

కరోనా పరీక్ష‌లు :

– జూలై 10వ తేదీ వరకు తిరుమల‌లో 1865 మంది టిటిడి ఉద్యోగుల‌కు, అలిపిరి వద్ద 1,704 మంది టిటిడి ఉద్యోగుల‌కు, 631 మంది భక్తుల‌కు కరోనా పరీక్ష‌లు నిర్వహించాం.

–  టిటిడి ఉద్యోగులకు 91 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

– తిరుమల‌లో పనిచేస్తున్న ఉద్యోగుల‌ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ఎంప్లాయిస్ క్యాంటీన్‌లో వారు కోరిన విధంగా మెను సిద్ధం చేశాం.

– శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల‌కు ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యా రాలేదు. దర్శనానంతరం ఇళ్ళకు వెళ్ళిన అనేక మంది భక్తుల‌తో టిటిడి సిబ్బంది ఫోన్‌ ద్వారా వారి ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నారు.

– జూన్‌ 18 నుండి 24వ తేదీ వరకు మొత్తం 700 మంది భక్తుల‌కు, జూలై 1 నుండి 7వ తేదీ వరకు మొత్తం 1943 మంది భక్తుల‌కు ఫోన్లు చేయగా అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాధానాలిచ్చారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.