DEVOTEES HAD DARSHAN OF “GODDESS OF WISDOM” ON HAMSA VAHANAM_ శ్రీ పద్మావతి అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు

Tiruchanur, 16 November 2017: The devotees were elated by the glimpse of Goddess Padmavathi Devi who graced them as “Saraswathi Devi”-the Goddess of Wisdom on Hamsa Vahanam on second day evening as a part of Navahnika Karthika Brahmotsavams on Thursday.

Saraswati is a Sanskrit fusion word which is a fusion of sāra which means “essence”, and sva which means “one self”, meaning “essence of one self”. Hence Goddess Saraswati is being revered as the “one who leads to essence of self-knowledge”.

Universal Mother Padmavathi Devi as the most powerful deity of Wisdom Saraswathi Devi, blessed the devotees in all Her splendor.

TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, Spl.Gr.Dy.EO Sri Muniratnam Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు

తిరుపతి, 2017 నవంబరు 16: భారతీయ సంస్కృతిలో అనాదిగా మహావిజ్ఞాన సంపన్నులైన మహాత్ములను, యోగిపుంగవులను ”పరమహంస”లుగా పేర్కొనడం సంప్రదాయం. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే నీరు, పాలు వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అట్టి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ రాధాకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.