DEVOTION PEAKS WITH SRI VISHNU SHASRA NAMA STOTRA PARAYANAM ON THE OCCASION OF BHISHMA EKADASI _ భక్తిభావాన్ని పంచిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం
Tirumala, 23 February 2021: The Sri Vishnu Sahasra Nama Stotra Parayanam produced positive vibes in Tirumala on Tuesday held from the Nada Neeranjanam platform and elevated the devotional elixir of spiritual programs organised by the TTD in connection with Bhishma Ekadasi.
While many devotees participated directly, thousands of others watched the SVBC live telecast and followed the parayanams sitting from their homes.
Earlier Sri Malayappa Swamy seated on the Chinna Sesha Vahana and Utsava idol of Sri Bhishmacharya on a small replica Ratha were offered Harati by Archakas.
The Vedic pundit, Dr M Pavana Kumara Sharma narrated the significance of the Vishnu Sahasra Nama and Sankalp.
Thereafter pundits chanted 30 shlokas of Sri Lakshmi Astottara Shatanama Stotra and 29 shlokas from Purva peetika. They also performed Parayanams of 108 shlokas of Vishnu Sharma Nama Stotra thrice and 34 shlokas from Uttara peethika.
The Narayana Nama Sankeetana by Sri Nagarajan team from Hyderabad enthralled the devotees. About 200 Vedic pundits from Dharmagiri Veda Vijnana Peetham, SV Vedic University, National Sanskrit University, SV Higher Vedic Studies Institute besides TTD Vedic parayanadars participated in this unique Parayanam program.
TTD is organising spiritual programs seeking relief from pandemic COVID-19 since April 2020 which are being telecasted live every day on SVBC for the sake of global devotees.
TTD Additional EO and MD of SVBC Sri AV Dharma Reddy, SVBC CEO Sri Suresh Kumar, OSD of SVIHVS Dr Akella Vibhishana Sharma and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
భక్తిభావాన్ని పంచిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం
తిరుమల, 2021 ఫిబ్రవరి 23 : భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం ఉదయం టిటిడి చేపట్టిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం భక్తిభావాన్ని పంచింది. పలువురు భక్తులు నేరుగా పాల్గొనగా, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది భక్తులు తమ ఇళ్లలోనే పారాయణం చేశారు. వేదికపై చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్పస్వామివారిని, పక్కన శ్రీ భీష్మాచార్యుల ప్రతిమను, చిన్న రథాన్ని కొలువుదీర్చి మంగళహారతి సమర్పించారు.
ముందుగా డా. ఎం.పవన కుమార శర్మ శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర వైశిష్ట్యాన్ని తెలియజేసి, సంకల్పం చెప్పారు. ఆ తరువాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్ 30 శ్లోకాలు, పూర్వపీఠిక 29 శ్లోకాలు పారాయణం చేశారు. అనంతరం విష్ణు సహస్రనామ స్తోత్రం 108 శ్లోకాలను మూడు సార్లు, ఉత్తరపీఠికలోని 34 శ్లోకాలను పారాయణం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన శ్రీ నాగరాజన్ బృందం చేసిన నారాయణ నామ సంకీర్తనం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థలోని సుమారు 200 మంది వేదపండితులు, సుమారు 400 మంది నిత్యం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసే పండితులు, ఉపాసకులు, సుమారు 400 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరోనా మహమ్మారిని అంతమొందించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ, లోకకల్యాణం కోసం 2020 ఏప్రిల్ నుండి టిటిడి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో యోగవాసిష్ఠం, ధన్వంతరి మహామంత్ర పారాయణం, సుందరకాండ పఠనం, వేదపారాయణం, విరాటపర్వం, శ్రీమద్భగవద్గీత, షోడశదిన సుందరకాండ పారాయణ దీక్ష, కార్తీక మాసోత్సవం, ధనుర్మాసోత్సవం, మాఘ మాసోత్సవం తదితర విశేష కార్యక్రమాలను రూపొందించి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించింది.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ జి.సురేష్ కుమార్, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.