DEVOTIONAL MUSICAL PROGRAMS ALLURES AUDIENCE _ అన్నమాచార్య కళామందిరంలో ఆద్యంతం భక్తిభావాన్ని పంచిన సంగీత కార్యక్రమాలు
Tirupati, 27 May 2024: The 616th birth anniversary celebrations of Sri Thallapaka Annamacharya on Monday at the Annamacharya Kalamandiram in Tirupati spread devotional vibes among the music lovers.
At 6 in the evening Sri Chaitanya and chi. Shrutika group from Visakhapatnam sang the Sankeertans “Govindasrita Gokula Brinda…, Vinadaga veru iha paramidigo…., Ala Venkatadri meeda Varadaivam…and mused the audience.
Later at 7 pm renowned singer Sri Jagarlamudi Madhavi Krishna troupe from Kerala attracted the people of the city with popular Sankeertans of Annamacharya such as “Vishwaroopam midigo Vishnu form midigo…, Mangabudi Hanumantha…” etc.
Annamacharya Project Director Dr. Vibhishana Sharma, Program Assistant Smt. Kokila, other officials and a large number of people participated in this program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అన్నమాచార్య కళామందిరంలో ఆద్యంతం భక్తిభావాన్ని పంచిన సంగీత కార్యక్రమాలు
తిరుపతి, 2024 మే 27: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆద్యంతం భక్తిభావాన్ని పంచాయి.
సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంకు చెందిన శ్రీ చైతన్య, చిన్నారి శృతిక బృందం ” గోవిందాశ్రిత గోకుల బృందా…, వినదగ వారికి ఇహపరమిదిగో….., అల వేంకటాద్రి మీద వరదైవం….” కీర్తనలను సుమాధురంగా ఆలపించారు.
అనంతరం రాత్రి 7 గంటలకు కేరళకు చెందిన శ్రీ జాగర్లమూడి మాధవి కృష్ణ బృందం ” విశ్వరూపం మిదిగో విష్ణు రూపం మిదిగో…., మంగాబుది హనుమంత…” తదితర సంకీర్తనలతో పుర ప్రజలను విశేషంగా ఆకర్షించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.