DGP INSPECTS BRAHMOTSAVAM SECURITY ARRANGEMENTS _ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుడీజీపీ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి

NEARLY 4000 POLICE TO VIGIL ANNUAL FETE

ENSURE HASSLE-FREE DARSHAN AND VAHANA SEVA TO PILGRIMS-DGP

Tirumala, 16 September 2023: As the annual brahmotsavams of Tirumala are set to commence from September 18 onwards, the AP Director General of Police, Sri Rajendranath Reddy has inspected the Security arrangements in Tirumala on Saturday evening.

Top brass cops from both Police and TTD accompanied the State Police Chief in the inspection along four mada streets surrounding the temple.

The DGP viewed the Entry and Exit points at different galleries, the refilling system of devotees during Garuda Vahana Seva and also discussed about the Bundobust arrangements for the visit of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on September 18 and 19 besides the security measures ensuring hassle-free Srivari Darshan and Vahana Darshan to the multitude of visiting pilgrims.

Later a high-level security meeting was held in Seva Sadan 2 meeting hall.

After the meeting speaking to the media he said, parking facilities for 15 thousand vehicles in Tirumala, a Geo-tagging facility for children, Focus on crowd management, traffic management, the safety of VIPs and devotees, besides behaving politely towards the devotees and ensuring them hassle-free darshan is our priority.

Security arrangements should be continuously monitored at Mada Streets, Inner Ring Road and Outer Ring Road”,  he maintained.

DIGs Sri Rajasekhar Babu, Sri Ravi Prakash, SPs Sri Parameshwar Reddy, Sri Tirumalesh, CVSO Sri Narasimha Kishore and other sleuths from police and TTD were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

– 4 వేల మంది పోలీసులతో భద్రత

– భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవల దర్శనం కల్పిస్తాం

– డీజీపీ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి

తిరుమల, 2023 సెప్టెంబరు 16: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుమలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లోని వివిధ గ్యాలరీలలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలించారు.

గరుడ వాహన సేవలో భక్తుల రీఫిల్లింగ్ వ్యవస్థ, సెప్టెంబర్ 18, 19 తేదీలలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం బందోబస్త్ ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, వాహనసేవల దర్శనం కల్పించాలని సూచించారు.

అనంతరం సేవా సదన్ -2 సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు 4 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తామన్నారు. గరుడ సేవ నాడు అదనంగా వెయ్యి మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం, చిన్నారులకు జియో ట్యాగింగ్‌, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్‌ నిర్వహణ, వీఐపీలు, భక్తుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించామని చెప్పారు. మాడ వీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు.

డిఐజిలు శ్రీ రాజశేఖర్ బాబు, శ్రీ రవిప్రకాష్, ఎస్పీలు శ్రీ పరమేశ్వర్ రెడ్డి, శ్రీ తిరుమలేష్, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, ఇతర పోలీసు మరియు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.