DHANURMASAM RITUALS BEGIN AT SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం జనవరి 14వ తేదీ వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం

TIRUPPAVAI PARAYANAM UP TO JANUARY 14

Tirumala, 17 Dec. 19:  The Dhanurmasam rituals, hailed as one of significant Monthly utsavas in Vaishnavite temples, commenced at Srivari temple with Tiruppavai Parayanam at 2.30 am to 5.30 am on Tuesday morning.

Puranic legends say that the 30 pasuras sung by Godadevi would be recited during the Dhanurmasam Parayanam as an ekanta seva. Hence during this month all pujas are performed in the early hours of Brahma muhurta at all vaishnavite temples.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

శ్రీవారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం

జనవరి 14వ తేదీ వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం

తిరుమ‌ల‌, 2019 డిసెంబ‌రు 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఘనంగా ప్రారంభమైంది. డిసెంబ‌రు 16న సోమ‌వారం రాత్రి 11.47 గంట‌ల‌కు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి. మంగ‌ళ‌వారం నుండి 2020 జనవరి 14వ తేదీ వరకు ఆలయంలో సుప్రభాతం స్థానంలో శ్రీవారికి తిరుప్పావై నివేదిస్తారు.

ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 2 నుంచి 5.30 గంటల వరకు తిరుప్పావై, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, మొదటి అర్చన ఏకాంతంగా నిర్వహించారు.

పురాణ నేపథ్యంలో గోదాదేవి తాను ద్వాపరయుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీక ష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

ధనుర్మాస వైశిష్ట్యం వివిధ పురాణాల్లో వివిధ విధాలుగా పేర్కొనబడింది. హైందవ సనాతన ధర్మానుసారం ఎవరైతే ఉదయాత్పూర్వం బ్రహ్మముహూర్తంలో కాలక త్యాలు తీర్చుకొని భగవంతునికి భక్తిపూర్వకంగా పూజలు నివేదిస్తారో వారికి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని ప్రశస్తి. ధనుర్మాసంలో శ్రీవారిని మధుసూదనుడిగా ప్రత్యేకించి కీర్తిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్ సృష్టిని లయబద్దంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుండే శ్రీకారం చుడతాడని కూడా పురాణప్రసిద్ధి. ఈ కారణంగానే ధనుర్మాసంలో ఉదయాత్పూర్వం బ్రహ్మముహూర్త కాలంలో లేచి శుచిగా పూజలు చేస్తారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాళ్‌ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదాకల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.