“DHARMA”IS OUR LANGUAGE _ తిరుమలలో ఘనంగా ముగిసిన అఖిలభారత వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు
Akhila Veda Shastra Agama Vidwat Sadas concludes in Tirumala
Tirumala, 01 March 20 ; Irrespective of different regions and different states, we are united since several centuries by the language of “Dharma” asserted, Sri Gouri Shankar, the Executive and Administrative Officer of Sringeri Peetham.
The six day long 28th Akhila Veda Shastra Agama Vidwat Sadas held at the SV Veda Vignana Peetham at Dharmagiri in Tirumala concluded on a grand note on Sunday.
During his keynote address, Sri Gouri Shankar complimented TTD for organising the vedic sadas from the past several years and sustaining the Vedas. Gathering of over 700 scholars on one platform is a commendable task. I wish all the students who are undergoing vedic education in this great place will promote and disseminate vedic knowledge to future generations”, he maintained.
AVADHANAM ENTHRALLS
The Avadhana Prakriya (a form of poetic recitation which is unique only to Telugu) by renowned Avdhana scholar Sri M Nagaphani Sharma enthralled audience in a big way admist grand applause.
CHATURVEDA HOMAM COMPLETES
As part of the six day sadas, the Chaturveda yagam concluded in the vedapathashala. Sri Kuppa Rama Gopala Somayaji and Kalpakamba Somasthini carried out the yaga as Dampati(couple).
MEDALLIONS DISTRIBUTED
Of the 727 students from all over India applied, 327 have took part in exams and among them 270 were declared successful.
While 178 who passed in first grade were presented 10 gm gold dollar each, remaining 92 were presented 10 gm silver dollars besides cash purses, certificates and shawls by the TTD.
The entire event was carried out under the supervision of Principal Sri KSS Avadhani.
Faculty Sri GAV Dikshitulu,Sri P Sitarama Charyulu, Sri NV Mohana Rangacharyulu,Sri VN Bhattacharya, SV Higher Vedic Studies OSD Dr A.Vibhishana Sharma and other teachers and students, parents participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ఘనంగా ముగిసిన అఖిలభారత వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు
తిరుమల, 2020 మార్చి 01 ;దేశంలోని వివిధ రాష్ట్రాలు, భిన్నసంస్కృతులతో సంబంధం లేకుండా “ధర్మం ” అనే ఒక భాష ద్వారా మనము అనేక శతాబ్దాల నుండి ఐక్యంగా ఉన్నామని శృగేరి పీఠం పాలనాధికారి శ్రీ గౌరీ శంకర్ ఉద్ఘాటించారు. తిరుమలలోని ధర్మగిరిలో గల శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 28వ అఖిలభారత శ్రీ వేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసింది. ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమైన సదస్సు 6 రోజుల పాటు నిర్వహించిన విషయం విదితమే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి వేద సదస్సులను నిర్వహించడం, వేద విద్యా వ్యాప్తికి టిటిడి చేస్తున్న కృషిని అభినందించారు. ఒకే వేదికపై 700 మందికి పైగా ప్రముఖ పండితులతో సదస్సు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ భవిష్యత్ తరాలకు వేద జ్ఞానాన్ని అందించాలని ఆయన కోరారు.
అనంతరం ప్రముఖ అవధన పండితుడు శ్రీ ఎం. నాగఫణి శర్మ నిర్వహించిన అవధన ప్రక్రియ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
చతుర్వేద హోమం పూర్తి
లోక కల్యాణార్థం ప్రతి రోజు చతుర్వేద పారాయణం, శ్రీ కుప్ప రామ గోపాల సోమయాజీ, కల్పకంబ సోమస్తిని దంపతులు గత 5 రోజులుగా స్త్రోత యాగం నిర్వహించారు. ఆదివారం ఉదయం శ్రీ వైష్ణవేష్ఠి యాగం, ప్రముఖ చతుర్వేద పండితులచే పూర్ణాహుతితో వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ముగిసింది.
భారతదేశం నలుమూలల నుండి 727 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 327 మందికి పరీక్షలలో పాల్గొన్నారు. వారిలో 270 మంది విజయం సాధించారు. ఈ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 178 మందికి 5 గ్రాముల బంగారు పతకం, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన 92 మందికి 10 గ్రాముల వెండి పతకం బహుమానంగా అందచేశారు. వీటితోపాటు నగదు బహుమతి, విజయపత్రిక, పండిత శాలువాతో సన్మానించారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా 104 మంది ప్రముఖ పండితులు పరీక్షాధికారులుగా విచ్చేశారు.
అనంతరం ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వారి “శృతివివేచని” పుస్తకాన్ని బ్రహ్మశ్రీ మడుగుల నాగఫణి శర్మ మరియు శృగేరి పీఠం పరిపాలనాధికారి శ్రీ గౌరీశంకర్ ఆవిష్కరించారు.
ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ఆధ్యాపకులు శ్రీ జిఎవి.దీక్షితులు, శ్రీ పి.సీతారామాచార్యులు, శ్రీ ఎన్వి.మోహనరంగాచార్యులు, శ్రీ విఎన్.భట్టాచార్య, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డాక్టర్ ఎ.విభిషణ శర్మ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.