DHARMIC CAMPAIGN TO ENTHUSE YOUTH- VISHAKA SARADA PEETHAM PONTIFF _ యువతలో ధార్మిక భావాలు పెంపొందించేలా మరింతగా ధర్మప్రచారం చేయండి- టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డికి విశాఖ శారదా పీఠాధిపతి సూచన

* TTD CHAIRMAN MEETS PONTIFF AT RISHIKESH

Tirupati,22 August 2023: Vishakha Sarad Peetham Pontiff Sri Sri Sri Swaroopananda Saraswathi Mahaswami has urged TTD Chairman Sri Bhumana Karunakara Reddy to undertake a Hindu Dharmic campaign to enthuse youth in dharmic activities and devotional culture.

Pontiff’s message came when TTD chairman along with his spouse called on later on  Tuesday at Rishikesh where he sought blessings after felicitating with Srivari Thirtha Prasadams and shawl.

Speaking on the occasion the pontiff advised TTD chairman to develop footpaths to Tirumala as protected zones for both wild animals and Srivari devotees. Among others the pontiff asked TTD chairman to fill up vacancies of Veda Parayanadars in TTD, and to promote the extended Sanatana Hindu Dharma campaign through HDPP in a big manner.

Thereafter the Pontiff and his successor Sri Swatmananda Swamy felicitated the TTD chairman couple and offered blessings.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

యువతలో ధార్మిక భావాలు పెంపొందించేలా మరింతగా ధర్మప్రచారం చేయండి

– టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డికి విశాఖ శారదా పీఠాధిపతి సూచన

– రుషికేష్ లో స్వామిని కలసిన టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుపతి 22 ఆగస్టు 2023: యువతలో ధార్మిక భావాలు పెంపొందించేలా నూతన కార్యక్రమాలను రూపొందించాలని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డికి సూచించారు.

టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి మంగళవారం రుషికేష్ లో సతీసమేతంగా శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిని గౌరవపూర్వకంగా కలిశారు.

స్వామికి శ్రీవారి ప్రసాదాన్ని అందించి శాలువతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్బంగా శ్రీ స్వరూపానంద స్వామి మాట్లాడుతూ, భక్తులు, వన్యప్రాణులకు రక్షిత జోన్ గా నడకదారిని అభివృద్ధి చేయాలని సూచించారు. వేద పారాయణదారుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు.

ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మరింత విస్తృతంగా ధర్మ ప్రచారం చేయాలని చెప్పారు.
అనంతరం శ్రీ కరుణాకర రెడ్డి దంపతులను శారదా పీఠాధిపతి శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు.

పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానంద స్వామిని కూడా చైర్మన్ దంపతులు శాలువాతో సన్మానించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది