DHARMIKA SADAS COMMENCES WITH ANUGRAHA BHASHANAM BY TIRUMALA PONTIFFS _ ధార్మిక సదస్సులో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం

TIRUMALA, 04 FEBRUARY 2024: The three-day Dharmika Sadas entered the second day on Sunday at Astana Mandapam in Tirumala on Sunday.

 

After Puja and Veda Swasthi, His Holiness Sri Sri Satagopa Ramanuja Pedda Jeeyar Swamy in his Anugraha Bhashanam on the occasion welcomed all the Peethadhipathis who graced the Dharmika Sadas to give their valuable suggestions to take forward Hindu Santana Dharma by TTD in a big way across the country and also to sustain the morals embedded in our Dharma for the future generations.

 

HH Sri Sri Narayana Ramanujacharya Chinna Jiyar Swamy of Tirumala also wished that the three day religious conclave emerge out to be a successful one with fruitful suggestions to take forward Hindu Sanatana Dharma in a big way.

TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, SVVU VC Sri Ranisadasivamurthy, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, CPRO Dr T Ravi, HDPP Secretary Sri Somayajulu, All Programs Officer Sri Rajagopal, Special Officer Dasa Sahitya Project Sri Anandatheerthacharya, Annamacharya Project Director Dr Vibhishana Sharma and others were also present.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ధార్మిక సదస్సులో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం

ఫిబ్రవరి 04, తిరుమల, 2024: తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సదస్సులో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి సమర్పించారు.

ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ దేశవ్యాప్తంగా గల పీఠాధిపతులు, మఠాధిపతులను ఆహ్వానించి శ్రీవారి పాదాల చెంత ధార్మిక సదస్సు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. స్వామీజీలు ఆయా సాంప్రదాయాల్లో ధర్మప్రచారం చేస్తున్నారని, వారి విలువైన సూచనలు తీసుకొని టీటీడీ మరింతగా ధర్మ ప్రచారం చేస్తుందని తెలియజేశారు. శ్రీ భూమన కరుణాకర రెడ్డి గతంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సమయంలో ధార్మిక సదస్సులు నిర్వహించి వినూత్నమైన ధర్మ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రస్తుత సదస్సు ద్వారా తిరిగి ధార్మిక కార్యక్రమాలను వేగవంతం చేస్తారని తెలిపారు.

తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహభాషణం చేస్తూ ధార్మిక సదస్సులో ఇంత పెద్ద సంఖ్యలో స్వామీజీలు పాల్గొనడం శుభసూచికమన్నారు. పూర్వయుగాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే మోక్షం లభించేదని, కలియుగంలో నామసంకీర్తన చేస్తే చాలు భగవంతుని కృప తప్పక కలుగుతుందని తెలియజేశారు. భగవన్నామస్మరణతో భక్తులు తమ కష్టాలను దూరం చేసుకుని, ముక్తి మార్గం వైపు పయనించవచ్చన్నారు.

టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, టీటీడీ జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, సీఈ నాగేశ్వరరావు, సీపీఆర్వో డా.టి.రవి, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ సోమయాజులు, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.