DHWAJAROHANAM FOR KARVETINAGARAM BTU PERFORMED _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 29 MAY 2024: The Dhwajarohanam ceremony of Karvetinagaram Sri Venugopala Swamy brahmotsavams was observed in the temple between 10am and 11 am in the Karkataka Lagnam on Wednesday. AEO Sri Parthasaradhi, Superintendent Sri Soma Sekhar and others participated in this program.

Earlier Sri Rukmini Satyabhama sameta Sri Venugopala Swamy were paraded on Golden Tiruchi along with Sri Chakrattalwar and Garuda Dhwajapatam. All the three crore deities of the different world were invited for the mega-religious event which concludes on June 6. 

The important days includes Pedda Sesha Vahanam on May 29, Kalyanotsavam on June 1, Garuda Vahanam on June 2, Rathtosavam on June 5 and Chakrasnanam on June 6. 

The Grihastas willing to take part in Kalyanotsavam shall have to pay Rs.750 on which two persons will be allowed. The HDPP and Annamacharya Projects of TTD have arranged special devotional programs during this period. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 మే 29: కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 10.30 నుండి 11 గంటల మధ్య క‌ర్కాట‌క‌ లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది.

అంత‌కుముందు ఉద‌యం 7.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని ఉద్దేశం.

రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామివారు పెద్ద శేష వాహ‌నంపై విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ పార్థ‌సార‌థి, సూపరింటెండెంట్ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్‌ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. జూన్ 7వ తేదీన మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

30-05-2024

ఉదయం – చిన్నశేష వాహనం

సాయంత్రం – హంస వాహనం

31-05-2024

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

01-06-2024

ఉదయం – కల్పవృక్ష వాహన

సాయంత్రం – ఆర్జితకళ్యాణోత్సవం/ సర్వభూపాల వాహనం

02-06-2024

ఉదయం – మోహినీ అవతారం

సాయంత్రం – గరుడ వాహనం

03-06-2024

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – గజ వాహనం

04-06-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

05-06-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

06-06-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో జూన్ 1వ తేదీ సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.