DHWAJAROHANAM HELD _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 10 JUNE 2022: The annual Brahmotsavams in Appalayagunta commenced with Dhwajarohanam on Friday between 10am and 10:20am in the auspicious Karkataka Lagnam.

Later Snapana Tirumanjanam was performed to utsava deities of Sri Bhu Sameta Sri Prasanna Venkateswara Swamy between 11:30am and 12:30pm.

Superintendent Smt Srivani, Temple Inspector Sri Siva Kumar, Kanakanabhattar Sri Suryakumaracharyulu and devotees were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 జూన్ 10: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 10 నుండి 10.20 గంటల వ‌ర‌కు క‌ర్కాట‌క లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

అంతకుముందు ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

అనంతరం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం జరిగింది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్ద శేషవాహన సేవ వైభవంగా జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శివ‌కుమార్‌, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.