DHWAJASTHAMBHA SAMPROKSHANAM AND NAVARATHRI BRAHMOTSAVAMS IN KARVETINAGARAM_ కార్వేటినగరము శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

Tirupati, 14 June 2018: The conduct of Dhwajasthambha Samprokshanam in Sri Venugopala Swamy Temple in Karvetinagaram will be from June 29 to July 1.

Acharya Ritwikvaranam followed by Ankurarpanam and Senapathi Utsavam will be observed in Yaga Shala on June 29. While on June 30 there will be Adhivaasathrayam and Mahashanti Tirumanjanam to utsava murthies. On July 1, Maha Poornahuthi, Dhwasthamba Maha Samprokshanam will be observed in Simha Lagnam between 9am and 10:30am.

NAVARATHRI BRAHMOTSAVAMS IN KARVETINAGARAM FROM JULY 2 TO JULY 10

The annual brahmotsavams in Sri Venugopala Swamy temple at Karvetinagaram will be observed from July 2 to July 10 in a big way by TTD.

The important days during the fete includes Dhwajarohanam on July 2, Kalyanotsavam on July 5, Garuda Seva on July 6, Rathotsavam on July 9 and Chakrasnanam on July 10.

Annual Pushpayagam will be observed on July 11 between 2.30pm and 3.30pm.

Tirupati JEO Sri P Bhaskar released the posters related to the temple in his chambers on Thursday. Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Tirumalaiah, Suptd Sri Munikrishna Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కార్వేటినగరము శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుపతి, 2018 జూన్‌ 14: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కార్వేటినగరములోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా సంప్రోక్షణము, నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ గురువారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఆయన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా సంప్రోక్షణము జూన్‌ 29 నుండి జూలై 1వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్వామివారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 2 నుండి 10వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా జూన్‌ 26వ తేదీ మంగళవారం కోయల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూలై 1వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

02-07-2018(సోమవారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం

03-07-2018(మంగళవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

04-07-2018(బుధవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

05-07-2018(గురువారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

06-07-2018(శుక్రవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

07-07-2018(శనివారం) హనుమంత వాహనం గజ వాహనం

08-07-2018(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

09-07-2018(సోమవారం) రథోత్సవం అశ్వవాహనం

10-07-2018(మంగళవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూలై 5వ తేదీ సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 11వ తేదీన మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీమునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీఎన్‌.ఎస్‌.ఎన్‌రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.