DHWAJAVAROHANAM HELD _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

Vontimitta, 25 April 2024: The annual Sri Rama Navami Brahmotsavam in Sri Kodanda Ramalayam temple at Vontimitta in YSR Kadapa district has come to a grand conclusion on Thursday evening with Dhwajavarohanam.

The deities belonging to all worlds who were invited to take part in the grand festivities on first day during Dhwajarohanam, were bid adieu with Dhwajavarohanam in a thankful manner amidst chanting of vedic hymns.

Temple officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 25: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నరేష్ బాబు, సూపరింటెండెంట్‌ శ్రీ హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నవీన్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.