DHWAJAVAROHANAM HELD _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

Tirupati, 13 April 2024: The nine-day annual fete comes to a grand conclusion with Dhwajavarohanam in Sri Kodandarama Swamy temple on Saturday evening in Tirupati.

The Garuda Flag was lowered from the temple mast amidst the chanting of Vedic Mantras on the occasion.

DyEO Smt Nagaratna, AEO Sri Parthasaradhi and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 ఏప్రిల్ 13: తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నాగరత్న, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, కంకణభట్టర్ శ్రీ సీతారామాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.