DHWAJAVAROHANAM HELD _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 28 NOVEMBER 2022: The traditional temple flag-lowering ceremony, Dhwajavarohanam was held in Sri Padmavathi Ammavaru temple on Monday on night, marking the conclusion of annual Karthika Brahmotsavam in Tiruchanoor.
The Gaja Dhwaja Patham on the temple mast was lowered amidst chanting of Vedic hymns by priests. All the deities who participated in the Nine-day festivities were rendered thanks for successfully taking forward the event and bid adieu on the occasion.
JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, temple Archakas and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 28 నవంబరు 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 9.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.
బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం . విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.