సెప్టెంబరు 7న డయల్‌ యువర్‌ ఈవో

సెప్టెంబరు 7న డయల్‌ యువర్‌ ఈవో

సెప్టెంబరు 05, తిరుమల 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం సెప్టెంబరు 7వ తేదీన జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

కాగా, డిసెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని కోరడమైనది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.