DIAL YOUR EO ON AUGUST 4_ ఆగస్టు 4న డయల్‌ యువర్‌ ఈవో

Tirumala, 2 August 2017: The monthly Dial Your EO program will take place on August 4 at Annamaiah Bhavan in Tirumala between 8:30am and 9:30am.

The pilgrims can give their feedback, suggestions etc. to the TTD EO Sri Anil Kumar Singhal over phone by dialing 0877 2263261.

TTD will release the online quota of arjitha seva tickets for the month of November on August 4 by 10am.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆగస్టు 4న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమల, 2017 ఆగస్టు 02: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఆగస్టు 4వ తేదీన జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన నంబరు : 0877-2263261.

ఆగస్టు 4న ఉదయం 10 గంటలకు నవంబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.