DIAMOND JUBILEE FETE OF SVCMD _ మార్చి 4, 5వ తేదీల్లో ఎస్వీ సంగీత క‌ళాశాల 60వ వార్షికోత్స‌వం

Tirupati, 03 Mar 20: The prestigious fine arts institutions run by TTD, Sri Venkateswara College of Music and Dance is all set to celebrate its Sixtieth year of Diamond Jubilee Fete in a big way on March 4 and 5 in Tirupati.

The two-day annual fete will commence at 3pm on Wednesday and there will be a series of cultural activities with the students and faculty up to 10pm with a meeting on the occasion at 6:30pm.

The Principal of SVCMD Smt Jamunarani, Nadaswaram School Inspector Sri Satyanarayana are supervising the arrangements for the big fete which is set to take place in the college auditorium.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

 

మార్చి 4, 5వ తేదీల్లో ఎస్వీ సంగీత క‌ళాశాల 60వ వార్షికోత్స‌వం

తిరుపతి, 2020 మార్చి 03 ; తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర సంగీత నృత్య క‌ళాశాల‌, ఎస్వీ నాద‌స్వ‌ర పాఠ‌శాల 60వ వార్షికోత్స‌వం మార్చి 4, 5వ తేదీల్లో జ‌రుగ‌నుంది. ఇందుకోసం క‌ళాశాలలో ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

మార్చి 4న బుధ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌ళాశాల ఆడిటోరియంలో వార్షికోత్స‌వ కార్యక్ర‌మాలు ప్రారంభ‌మ‌వుతాయి. రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు వివిధ సంగీత, నృత్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. మార్చి 4, 5వ తేదీల్లో సాయంత్రం 6.30 గంట‌ల‌కు అతిథుల స‌ద‌స్సు ఉంటుంది.

ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్‌.జ‌మునారాణి, ఎస్వీ నాద‌స్వ‌ర పాఠ‌శాల హెడ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ శ్రీ వి.స‌త్య‌నారాయ‌ణ ఈ కార్య‌క్ర‌మాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.