DISCHARGE YOUR DUTIES WITH PATIENCE AND DEDICATION AT COUNTERS-JEO(H&E) _ స‌ర్వ‌ద‌ర్శ‌నం కౌంటర్లలో అంకితభావంతో విధులు నిర్వ‌హించాలి _⁠ ⁠జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

Tirupati, 21 December 2023: The JEO for Health and Education Smt Sada Bhargavi called upon the all the Nodal Officers and staff deputed for Counters to issue Vaikunthadwara Darshanam tokens to devotees, with patience and dedication.

Addressing a briefing session held for 400 odd deputation employees at SVETA Bhavan in Tirupati on Thursday she said the TTD has made elaborate arrangements to issue four lakh odd tokens to devotees coming from across the country for Vaikunthadwara Darshanam from December 23 to January 1.

She asked everyone to completely dedicate themselves in this challenging task of issuing tokens in an incident-free manner. The JEO also said the food, water and other amenities of both the devotees as well the on duty counter staff will be taken care by the respective Nodal Officers of each centre.

She said tokens will be issued to the devotees on verification of their individual Adhaar cards in person in a sequential manner without choices of dates and time slots.

The queue line management will be manned by the Tahasildars and Police drafted for the duty while the tokens will be issued in all counters continuously till they are exhausted.

Later GM IT Sri Sandeep explained the deputation staff on the procedure of allocation of tokens through PowerPoint presentation.

Nodal officers Sri Bhaskar Reddy, Dr Harnath Reddy, Sri Venkatramana, Sri Govindarajan, Sri Rajagopal, Sri Anandaraju, Smt Padmavati, Smt Bharati, Sri Ramaraju were also present.

Among other HoDs Sri Subramanyam, Smt Prasanthi, deputation staffs were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స‌ర్వ‌ద‌ర్శ‌నం కౌంటర్లలో అంకితభావంతో విధులు నిర్వ‌హించాలి _⁠ ⁠జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుప‌తి, 2023 డిసెంబ‌రు 21: వైకుంఠద్వార దర్శనం టోకెన్లను ఓర్పుతో, అంకితభావంతో భక్తులకు అందజేయాలని తిరుప‌తిలోని కౌంటర్లలో విధులు కేటాయించిన నోడల్ అధికారులకు, సిబ్బందికి జేఈవో శ్రీమతి సదా భార్గవి సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో గురువారం 400 మంది డెప్యుటేషన్ సిబ్బందిని ఉద్దేశించి జెఈవో మాట్లాడారు.

డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం కోసం దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు నాలుగు లక్షలకుపైగా టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా సిబ్బంది విధులు నిర్వ‌హించాల‌ని కోరారు. భక్తులకు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు త‌దిత‌ర సౌకర్యాలను ఆయా కేంద్రాల్లోని నోడల్ అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. భ‌క్తుల ఆధార్ కార్డును ధ్రువీక‌రించుకుని తేదీల వారీగా వ‌రుస క్ర‌మంలో టోకెన్లు మంజూరు చేయాల‌ని, తేదీలు, స్లాట్లు మార్చుకునే అవ‌కాశం లేద‌ని వివ‌రించారు. త‌హ‌సీల్దార్లు, పోలీసులు క్యూలైన్ల‌లో భ‌క్తుల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తార‌ని తెలిపారు. మొత్తం టోకెన్లు పూర్త‌య్యే వ‌ర‌కు అన్ని కౌంటర్లలో నిరంతరాయంగా జారీ చేస్తార‌ని చెప్పారు.

అనంతరం ఐటి జిఎం శ్రీ సందీప్‌ పవర్‌పాయింట్ ప్ర‌జెంటేషన్‌ ద్వారా టోకెన్ల కేటాయింపు విధానాన్ని డెప్యుటేషన్‌ సిబ్బందికి వివరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో నోడల్ అధికారులు శ్రీ భాస్కర్ రెడ్డి, డాక్టర్ హరనాథ్ రెడ్డి, శ్రీ వెంకట్రమణ, శ్రీ గోవిందరాజన్, శ్రీ రాజగోపాల్, శ్రీ ఆనందరాజు, శ్రీమతి పద్మావతి, శ్రీమతి భారతి, శ్రీ రామరాజు, ఇతర హెచ్ఓడిలు శ్రీ సుబ్రమణ్యం, శ్రీమతి ప్రశాంతి, డెప్యుటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.