DIVINE BLESSINGS WITH TIRUPPAVAI PRAVACHANAMRITA _ తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కటాక్షం

•  TIRUMALA JUNIOR PONTIFF

Tirupati, 16 December 2023: Tirumala Sri Sri Chinna Jeeyar Swamy said that Tiruppavai is the essence of the Vedas and that God’s grace can be attained with the recitation of Tiruppavai Pravachanamrita.

Under the auspices of TTD Alwar Divya Prabandha Project, the inaugural meeting of Tiruppavai Pravachanams was held at Annamacharya Kalamandiram in Tirupati on Saturday evening.

On this occasion, the Junior Pontiff of Tirumala in his religious discourse said Andal Sri Goda Devi is said to be one of the 12 Alwars who spread the glory of Srivaru through Pashuras.  Godadevi praised God with unique devotion.

HDPP Secretary Sri Somayajulu, Scholar Sri Ranganathan, Program co-ordinator Sri Purushottam, local devotees were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కటాక్షం

•⁠ ⁠వేదాల సార‌మే తిరుప్పావై : తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి

తిరుప‌తి, 2023 డిసెంబ‌రు 16: తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కృపా కటాక్షాలకు పాత్రులు కావచ్చని, వేదాల సార‌మే తిరుప్పావై అని తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి చెప్పారు.

టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం సాయంత్రం తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరిగింది.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని పాశురాల ద్వారా వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్ల‌లో గోదాదేవి ఒకరిని చెప్పారు. గోదాదేవి అన‌న్య‌మైన భ‌క్తిభావ‌న‌తో భ‌గ‌వంతుని కీర్తిస్తూ పాశురాలు ర‌చించార‌ని తెలిపారు.
భ‌గ‌వంతుని ఆరాధ‌న‌కు భాషతో ప‌నిలేద‌ని, భావ‌న ముఖ్య‌మ‌ని చెప్పారు.

టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ సోమయాజులు మాట్లాడుతూ, ధ‌నుర్మాసంలో 30 రోజుల పాటు భ‌క్తుల హృద‌యాల్లో జ్ఞాన‌జ్యోతులు వెలిగించేందుకు తిరుప్పావై ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఈ మాసంలోనే వస్తుందన్నారు. దేశ‌వ్యాప్తంగా 216 ప్ర‌దేశాల్లో ఈ కార్య‌క్రమం జ‌రుగుతుంద‌న్నారు.

ప్ర‌వ‌చ‌న‌క‌ర్త శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ మాట్లాడుతూ, సూర్యుడు ధ‌ను రాశిలో ప్ర‌వేశించ‌డాన్నే ధ‌నుర్మాసం అంటార‌న్నారు. ఈ మాసంలో బ్ర‌హ్మ ముహూర్తంలో భ‌గ‌వంతుని ఆరాధిస్తే మంచి ఫ‌లితం వ‌స్తుంద‌ని చెప్పారు. గోదాదేవి అమ్మ‌వారు పూమాల‌ల‌తోపాటు పాశురాల మాల‌ను శ్రీ రంగ‌నాథ‌స్వామికి స‌మ‌ర్పించార‌ని వివ‌రించారు.

కాగా, ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14వ తేదీ వరకు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ చే తిరుప్పావై పై ప్రవచనం ఉంటుంది. శ్రీ‌మ‌తి ద్వారం లక్ష్మి పాశురాల‌ను గానం చేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ పురుషోత్తం, పుర ప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.