DIVYA KASI BHAVYA KASI TELECASTED ON SVBC 3 AND 4 _ ఎస్వీబీసీ-3, 4 ఛానళ్లలో దివ్య కాశి భవ్య కాశి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
TIRUMALA, 14 DECEMBER 2021: Divya Kasi Bhavya Kasi program where in the Honourable Prime Minister of India Sri Narendra Modi participated was telecasted live on SVBC 3 and 4 on December 13.
After Srivari Kalyanotsavam, it was also telecasted on SVBC Telugu.
But without knowing the facts, some tried to malign the image of TTD by sharing false information on TTD through certain media.
TTD is seriously condemning such false propaganda which would hurt the sentiments of millions of devotees.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీబీసీ-3, 4 ఛానళ్లలో దివ్య కాశి భవ్య కాశి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం
శ్రీవారి కల్యాణోత్సవం తరువాత తెలుగు ఛానల్లోనూ ప్రసారం
తిరుమల, 2021 డిసెంబరు 14: ప్రధానమంత్రి గౌ. శ్రీ నరేంద్రమోడీగారి చేతుల మీదుగా డిసెంబరు 13న సోమవారం నిర్వహించిన దివ్య కాశి భవ్య కాశి కార్యక్రమాన్ని ఎస్వీబీసీ-3, 4 ఛానళ్లలో పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. శ్రీవారి కల్యాణోత్సవం లైవ్ తరువాత తెలుగు ఛానల్లోనూ ఈ కార్యక్రమం ప్రసారమైంది.
వాస్తవాలు ఇలా ఉండగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదని కొందరు ప్రసార మాధ్యమాల ద్వారా ఆరోపించడం బాధాకరం. టిటిడిపై బురద చల్లడమే లక్ష్యంగా అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించడమైనది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆరోపణలు చేసేముందు వాస్తవాలను నిర్ధారణ చేసుకోవాలని కోరడమైనది. ఆధ్యాత్మిక సంస్థపై అవాస్తవాలతో కూడిన ప్రకటనలు ఇవ్వడం మంచిదికాదని తెలియజేస్తున్నాం.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.