DIWALI CELEBRATED WITH APLOMB IN BIRRD_ బర్డ్‌ ఆసుపత్రిలో ఘనంగా దీపావళి సంబరాలు

Tirupati, 18 Oct. 17: The festival of lights brought illumination in the eyes of patients who enjoyed the crackers feast in TTD-run BIRRD hospital in Tirupati on Wednesday.

Every year the hospital Director Dr G Jagdeesh celebrates the festival of Deepavali in a grand manner along with his in patients, hospital staff and doctors.

The patients felt it as if they were in their Home turf and enjoyed the fest thoroughly.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

బర్డ్‌ ఆసుపత్రిలో ఘనంగా దీపావళి సంబరాలు

వికలాంగ చిన్నారులతో కలిసి టపాసులు పేల్చిన డైరెక్టర్‌ డా|| జగదీష్‌

తిరుపతి, 2017 అక్టోబరు 18: తిరుపతిలోని టిటిడికి చెందిన బర్డ్‌ ఆసుపత్రిలో బుధవారం దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంటికి దూరంగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వికలాంగ చిన్నారులతో కలిసి బర్డ్‌ ఆసుపత్రి సంచాలకులు డా|| జగదీష్‌ దంపతులు టపాసులు కాల్చి దీపావళి జరుపుకున్నారు.

ఈ సందర్భంగా డా|| జగదీష్‌ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి ఇంటికి దూరంగా ఉన్నామన్న బెంగను దూరం చేసేందుకు 15 ఏళ్లుగా దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది కలిసి రోగులతో మమేకమై టపాకాయలు పేల్చడం వల్ల రోగుల్లో మనోధైర్యం పెరుగుతుందన్నారు. 1983వ సంవత్సరంలో 50 పడకలతో ఆసుపత్రి ప్రారంభమైందని, ప్రస్తుతం 350 పడకలతో ఆసియాలోనే అతిపెద్ద ఆసుపత్రిగా నిలిచిందని తెలిపారు. 15 అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయని, దేశం నలుమూలల నుంచి రోగులు ఇక్కడికి వచ్చి వైద్యసేవలు పొందుతున్నారని వివరించారు. శివకాశి నుంచి దాతలు నెల రోజుల ముందుగానే టపాసులను ఉచితంగా అందజేశారని తెలిపారు.

అంతకుముందు వికలాంగ చిన్నారులకు బాణసంచా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బర్డ్‌ ఆసుపత్రి డాక్టర్లు, వైద్యసిబ్బంది, వికలాంగ చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.