DO NOT TRUST MIDDLEMEN FOR DARSHAN AND ACCOMMODATION _ శ్రీవారి దర్శనాలు, వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దు

Tirumala, June 25, 2026: TTD has once again appealed to devotees not to believe middlemen who promise Srivari darshan or accommodation in Tirumala. 

TTD stated that it is taking strict action against such brokers who mislead devotees and collect money.

Devotees are requested to lodge a complaint immediately to TTD toll-free number 155257 if anyone contacts them in the name of darshan or accommodation. 

TTD warned that strict action will be taken against those who exploit devotees’ faith in Sri Venkateswara Swamy.

TTD also clarified that misleading social media posts about senior citizen darshan are false. 

An online quota for 1,000 elderly and disabled devotees is released every day, three months in advance. The senior citizen/PHC darshan line near the Tirumala Nambi Temple allows darshan at 3 pm daily.

For accurate information, devotees should rely only on the official TTD website: www.tirumala.org https://ttdevastanams.ap.in

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి దర్శనాలు, వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దు

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

తిరుమల, 2026 జూన్ 25: తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ ఇటీవల భక్తులను కొందరు దళారులు మోసం చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడంతో మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మవద్దని మరోమారు టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

శ్రీవారి దర్శనాలు, తిరుమలలో వసతికి సంబంధించి భక్తులను మోసం చేస్తున్న దళారులపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది.

అయినప్పటికీ మోసపూరితమైన మాటలతో భక్తులను నమ్మించి డబ్బులు తీసుకుని ఉడాయించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి‌.

ఈ నేపథ్యంలో ఎవరైనా దర్శనాలు, వసతి పేరుతో సంప్రదిస్తే వెంటనే టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ : 155257 కు ఫిర్యాదు చేయాల్సిందిగా భక్తులను కోరడమైనది.

శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఎంతో విశ్వాసము ఉంచి స్వామివారి దర్శనం కోసం పరితపించే భక్తుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్న ఎంతటివారైనా సరే వారి పట్ల టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది‌.

మరోవైపు వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం.

ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది.

టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.

తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేస్తున్నది.

భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరు. దళారులు, మధ్య వర్తుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేయడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.