శ్రీ బాలాజి అరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని ప‌థ‌కానికి రూ.11 ల‌క్ష‌లు విరాళం


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ బాలాజి అరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని ప‌థ‌కానికి రూ.11 ల‌క్ష‌లు విరాళం

అక్టోబరు 26, తిరుప‌తి 2018: టిటిడి శ్రీ బాలాజి అరోగ్య వర‌ప్ర‌సాదిని ప‌థ‌కానికి శుక్ర‌వారం రూ.11 ల‌క్ష‌లు విరాళంగా అందింది. తిరుప‌తి మాజీ ఎంపి శ్రీ నెల‌వ‌ల సుబ్ర‌మ‌ణ్యం ఆధ్వ‌ర్యంలో జంషెడ్‌పూర్‌కు చెందిన త్రివేణి ఇజికాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ త‌ర‌ఫున ప్ర‌తినిధి శ్రీ వై.రాఘ‌వేంద్ర ఈ మేర‌కు విరాళం చెక్కును టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌కు అందించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో విరాళాన్ని అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.