ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, 2019 జనవరి 29: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. విజయవాడ రూరల్ నిడమానూరుకు చెందిన శ్రీ వేములపల్లి లక్ష్మీ నారాయణ ఈ మేరకు విరాళం చెక్కును తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో టిటిడి ఛైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్‌కు అందజేశారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.