DONATION OF RS 18LAKHS WORTH LORDS LAMINATION PHOTOS TO SVIMS _ స్విమ్స్‌కు శ్రీవారి చిత్రపటాల విరాళం
స్విమ్స్‌కు శ్రీవారి చిత్రపటాల విరాళం
తిరుపతి, 3 ఆగష్టు 2013 : తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత వెలసియున్న శ్రీ వేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆస్పత్రికి శనివారం నాడు తిరుపతికి చెందిన లావణ్య ఫొటో ల్యామినేషన్ అధినేత శ్రీ శంకర్‌నాయుడు రు.18 లక్షలు విలువచేసే శ్రీవారి చిత్ర పటాలను విరాళంగా అందించారు. ఈ చిత్ర పటాలను స్వీికరించిన తిరుమల జెఇఓ శ్రీ శ్రీనివాసరాజు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మకు అందించారు.
ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రిలో ప్రతి ఒక్క వార్డులలో స్వామి వారి చిత్ర పటాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా చికిత్స పొందుతున్న రోగులకు స్వామివారి అనుగ్రహం ఉండే విధంగా ఈ చిత్రపటాలు ఒక దివ్యానుభూతిని కల్గిస్తాయని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆస్పత్రి ఆవరణలో స్వామి,అమ్మవార్ల చిత్ర పటాలు ఆనందాన్ని కల్గించి, ప్రశాంతతను చేకూర్చుతాయని ఆయన తెలిపారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.