DOWN GHAT SERVICES RESTORED _ డౌన్ ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకల పునరుద్ధరణ
TO DECIDE ON UP GHAT ROAD SERVICES AFTER NOON
TTD APPEALS TO DEVOTEES TO CO-OPERATE
TIRUMALA, 19 NOVEMBER 2021: TTD has resumed services in Down Ghat Road on Friday morning for the sake of devotees who got stranded in Tirumala and in Tirupati.
After strenuous efforts throughout last night, TTD has removed all the boulders and rocks which fell in the first ghat (down ghat) road.
For the sake of pilgrims, both to and fro vehicular movements will take place in First Ghat Road as the second ghat road(up ghat) is still not restored.
The devotees are requested not to get down from their vehicles to take videos and photos as it will obstruct the vehicular movement and co-operate with TTD.
Assessing the situation till Friday afternoon, TTD will decide on the opening of Up Ghat road operations.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డౌన్ ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకల పునరుద్ధరణ
– మధ్యాహ్నం తరువాత అప్ ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిపై నిర్ణయం
టీటీడీ
తిరుమల 19 నవంబరు 2021: అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాక పోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటన లో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రమించి తొలగింపజేశారు. భక్తుల సౌకర్యం దృష్యా ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతోంది. భక్తులెవరు ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి ఉంచడం లాంటివి చేసి తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి తిరుమల కు వెళ్ళే ఘాట్ రోడ్ లో అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో వాటి తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. మధ్యాహ్నం తరువాత పరిస్థితి ని అంచనా వేసి ఈ మార్గంలో వాహనాల ను అనుమతించే విషయం పై టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది