సనాతన ధర్మాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్ళాలి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
సనాతన ధర్మాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్ళాలి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
జనవరి 25, తిరుపతి 2019: సనాతన ధర్మ ప్రచారం, పరిరక్షణకు ధర్మాచార్యులు కృషి చేయాలని, దీనిని ఒక ఉద్యమంలా ప్రజలలోనికి తీసుకు వెళ్ళలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శుక్రవారం టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మాచార్యుల సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలలోపు వారికి ధర్మపరిచయం పేరిట భోధించేందుకు హిందూ ధర్మాప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది ధర్మాచార్యులకు శిక్షణ ఇచ్చామన్నారు. ధర్మాచార్యులు 2020 డిసెంబరు 31వ తేదీ వరకు తాము నిర్వహించవలసిన కార్యక్రమాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ధర్మాచార్యులు 5 గ్రూపులుగా ఏర్పడి తాము భోధించవలసిన ధర్మపరిచయం పుస్తకంలోని పాఠ్యాంశాలు, కరదీపిక,యువతలో చైతన్యం తెచ్చేందుకు తీసుకోవలసిన చర్యలు, క్షేత్ర స్థాయి నుండి జరుగు కార్యక్రమాలు డిపిపి కార్యాలయానికి తెలియచేయడం, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ధర్మాచార్యులు విధి నిర్వహణలో ఏదుర్కొంటున్న సమస్యలు, వారి సలహాలు, సూచనలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. త్వరలో మరో 300 మంది ధర్మాచార్యులకు శిక్షణ ఇచ్చి, వీరి ద్వారా రెండు తెలుగు రాష్టాలలో 25 వేల మంది ధర్మాచార్యులను తయారుచేయనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా..రమణ ప్రసాద్, ధార్మిక పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య దామోదరనాయుడు, ఇతర అధికారులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 180 మంది ధర్మాచార్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.