ఫిబ్రవరి 4న తిరుపతిలో శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామిజీ ఉపన్యాసం
ఫిబ్రవరి 4న తిరుపతిలో శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామిజీ ఉపన్యాసం
తిరుపతి, 2018 ఫిబ్రవరి 03: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వినాయక నగర్ క్వార్టర్స్ ప్రాంగణంలో గల మైదానంలో ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం ఉదయం హిందూ దేవాలయ పరిరక్షణ పీఠంకు చెందిన శ్రీశ్రీశ్రీ కమలానంద
భారతీ స్వామిజీ ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామిజీ ఉపన్యసిస్తారు.
అనంతరం శ్రీవారి కల్యాణోత్సవం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమవుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది.
సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.