DRESS MATERIALS DONATED _ శ్రీ‌వారి సేవా మ‌గ‌ క్షుర‌కుల‌కు పంచెలు, ష‌ర్టుల‌ను అందించిన అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 16 Oct. 19: The Additional EO of TTD,  Sri AV Dharma Reddy has presented approximately Rs.10lakhs worth uniform dress materials to the Kalyanakatta Srivari Seva male barbers at Main Kalyanakatta on Wednesday evening. 

It may be mentioned here that, during annual brahmotsavams, two pairs of sarees were presented to 274 women barbers. 

Meanwhile,  Chennai based donor Sri Kuppuswamy has donated the materials which were presented to 668 KKC Srivari Seva male barbers. 

DyEO KKC Smt Nagarathna,  AEO Sri Jaganmohanachari were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

శ్రీ‌వారి సేవా మ‌గ‌ క్షుర‌కుల‌కు పంచెలు, ష‌ర్టుల‌ను అందించిన అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2019 అక్టోబ‌రు 16: తిరుమల కల్యాణకట్టలో విధులు నిర్వ‌హిస్తున్న 668 మంది  శ్రీ‌వారి సేవా మ‌గ క్షుర‌కుల‌కు రెండు జ‌త‌ల‌ పంచ‌లు, ష‌ర్టుల‌ను అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి బుధ‌వారం అందజేశారు.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమలలోని అస్థాన‌ మండపంలో జ‌రిగిన‌ ఓరియంటేషన్ కార్యక్రమంలో క్షుర‌కుల‌ అభ్యర్థన మేరకు విరాళంగా చీరలు, పంచ‌లు, ష‌ర్టులు ఇస్తామని అదనపు ఈవో వారికి హామీ ఇచ్చిన విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన దాత శ్రీ కుప్పుస్వామి 668 క‌ల్యాణ‌క‌ట్ట‌ శ్రీవారి సేవా మగ క్షుర‌కుల‌కు దాదాపు రూ.10 ల‌క్ష‌ల విలువ గ‌ల పంచ‌లు, ష‌ర్టులు విరాళంగా అందించారు. గ‌తంలో 274 మంది మహిళా క్షుర‌కులకు రెండు జ‌త‌ల చీర‌లు విరాళంగా ఇచ్చిన‌ విష‌యం తెలిసిందే.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ జగన్మోహ‌నాచారి,  ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.