DWADASI CHAKRA SNANAM PERFORMED _ శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

Tirumala, 7 Jan. 20: On the occasion of Swamy Pushkarini Theertha Mukkoti on Vaikuntha Dwadasi day, Chakrasnanam has been performed with religious fervour on Tuesday.

During the early hours before sun rise, the Sudarshana Chakrattalwar was taken to the temple tank on a celestial procession and Chakrasnanam is performed between 4:30am and 5:30am.

TTD EO Sri Anil Kumar Singhal took part in this fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

తిరుమల, 07 జ‌న‌వ‌రి 2020: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగ‌ళ‌వారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుద‌ర్శ‌న చ‌క్ర‌త్తాళ్వార్‌ను శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ భూవ‌రాహ‌స్వామివారి ఆల‌యానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.

 శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నాన‌మాచ‌రించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం. ద్వాద‌శి ప‌ర్వ‌దినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవ‌లను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.