DWAJA AVAROHANAM HERALDED FINALE OF SRI GT ANNUAL BRAHMOTSAVAMS _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

Tirupati, 26 May 2021: The nine day-long celebrations of the annual Brahmotsavam of Sri Govindaraja Swamy temple in Tirupati concluded on Wednesday evening with the Dwajavarohanam episode that was observed between 5.30 pm and 6.30 pm.

The Garuda Dhwajapatham which was hoisted on the temple mast during first day was lowered on the last day amidst chanting of divine mantras and thanking the deities for the successful conduct of the nine-day mega religious fete.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, Special Grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravikumar Reddy, Superintendents Sri Venkatadri and Sri Kumar, Temple inspectors Sri Munindrababu and Sri Kamaraj and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి, 2021 మే 26: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు బుధ‌వారం సాయంత్రం ధ్వజావరోహణంతో ముగిశాయి.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, ఇతర అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.