DWAJAROHANAM OF KOSUVARIPALLI TEMPLE HELD _ ధ్వజారోహణంతో ప్రారంభంమైన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు

Tirupati, 10 February 2024: The annual Brahmotsavam of TTD run Sri Prasanna Venkataramana temple in Kosuvaripali of Tamballapalli Madal commenced on Saturday with Dwajarohanam fete.

Earlier the utsava idols and Garuda Flag were paraded around the temple inviting all the deities for the event and the Festival flag was hoisted amidst special pujas between 10.30 am and 11.30am on Saturday.

The Pallaki festival was held tonight. The fest will conclude on February 18.

Devotee couples could participate in the Kalyanotsavam on February 15 with ₹300 per ticket. TTD is organising Pushpayagam on February 19 in the evening.

On all days the artists of HDPP  and Annamacharya project will perform cultural activities.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ధ్వజారోహణంతో ప్రారంభంమైన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 ఫిబ్ర‌వ‌రి 10: తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శ‌నివారం ఉద‌యం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

ముందుగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామి ఉత్సవమూర్తులు‌, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 10.35 నుండి 11.30 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కాగా, రాత్రి ప‌ల్ల‌కీ ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌రకు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

11-02-2024

ఉదయం – శేష వాహనం                           రాత్రి – హంస వాహనం

12-02-2024

ఉదయం – ముత్యపుపందిరి వాహనం     రాత్రి – సింహవాహనం

13-02-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి –         హనుమంత వాహనం

14-02-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం                రాత్రి – చంద్రప్రభ వాహనం

15-02-2024

ఉద‌యం – సర్వభూపాల వాహనం           రాత్రి – కల్యాణోత్సవం, గరుడవాహనం

16-02-2024

ఉద‌యం – రథోత్సవం                                రాత్రి – గజ వాహనం

17-02-2024

ఉద‌యం – పల్లకీ ఉత్సవం                        రాత్రి – అశ్వ వాహనం

18-02-2024

ఉద‌యం – చక్రస్నానం,                              రాత్రి – ధ్వజావరోహణం

ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ ఆలయంలో కల్యాణోత్సవం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీ ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య‌ ఏఈవో శ్రీ గోపీనాథ్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కిషన్ కుమార్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.