నవంబరు 13న మేల్‌ఛాట్‌ వస్త్రాల ఈ-వేలం

నవంబరు 13న మేల్‌ఛాట్‌ వస్త్రాల ఈ-వేలం

నవంబరు 08, తిరుపతి, 2017: టిటిడిలో వినియోగించిన మేల్‌ఛాట్‌ వస్త్రాల(ప్యూర్‌ సిల్క్‌/హాఫ్‌ జరి) ఈ-వేలం నవంబరు 13వ తేదీన జరుగనుంది. టిటిడి మార్కెటింగ్‌ విభాగంలో 17 లాట్లకు విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org / www.mstcecommerce. com/ www.mstcindia.co.in వెబ్‌సైట్లను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.