e-M BOOK FROM NOVEMBER 29 ONWARDS- EO _ నవంబరు 29 నుంచి ఈ ఎం బుక్ అమలు చేయాలి

TIRUPATI, 17 November 2021: Bring into force the usage of e- M Book facility by November 29, said TTD EO Dr KS Jawahar Reddy.

Reviewing with the officials concerned at Padmavathi Rest House in Tirupati on Wednesday evening the EO directed IT, wing officials, to come out with an exclusive software for e-M Book to facilitate to know the status of ongoing works.

He also instructed the consent to supply tab and key board for checking the progress of works through e- M book.

The EO also directed to classify the works as Tirupati and Tirumala and maintain details of works.

JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SE s Sri Satyanarayana, Sri Venkateswarulu, Additional FACAO Sri Raviprasadu, IT Chief Sri Sesha Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 29 నుంచి ఈ  ఎం బుక్ అమలు చేయాలి

– అధికారులకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశం

తిరుపతి 17 నవంబరు 2021: ఐటి విభాగం తయారు చేసిన ఈ ఎం బుక్ ను నవంబరు 29 నుంచి అమలు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బుధవారం ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటి విభాగం అధికారులు ఈ ఎం బుక్ ఉపయోగించే విధానంపై డెమో ఇచ్చారు. అనంతరం ఈవో మాట్లాడుతూ, ఈ ఎం బుక్ సాఫ్ట్వేర్ తయారీ పనులు 90 శాతం పూర్తి అయ్యాయని, మిగిలిన 10 శాతం పనులు త్వరగా పూర్తి చేసి 29వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పారు. ఈ లోపు ఇంజినీరింగ్ అధికారులు తిరుమల, తిరుపతి ని రెండు డివిజన్లు గా విభజించుకుని ట్రైల్ రన్ నిర్వహించాలని డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ లోపు ఏవైనా సాంకేతిక సమస్యలు గుర్తిస్తే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ఎం బుక్ అమలు చేయడానికి ఎఈలు, డిఈ ఈ లకు ట్యాబ్, కీ బోర్డ్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మలివిడతలో ఈ ఈ లు, డి ఈ లకు కూడా వీటిని అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఎం బుక్ డిజిటైజ్ చేయడం వల్ల ఒకే సారి ఎంత మందైనా సబంధిత పని వివరాలు చూసే అవకాశం ఉంటుందని ఈవో చెప్పారు. అధికారులు మ్యానువల్ గా బుక్ లు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, సమాచారం కూడా ఆన్లైన్ లో భద్ర పరచే అవకాశం లభిస్తుందన్నారు.

జెఈవో శ్రీ వీర బ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ లు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, అదనపు ఎఫ్ ఏ సిఏవో శ్రీ రవి ప్రసాదు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది