e-RAKT KOSH HELD IN ASWINI _ అశ్విని ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం
అశ్విని ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం
తిరుమల, 2022 సెప్టెంబరు 17 ;భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇ-రక్త్ కోష్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తిరుమలలోని టిటిడి అశ్విని ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంక్‌లను అనుసంధానం చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ఇ-రక్త్ కోష్ దోహదం చేస్తుందని అశ్విని ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి తెలిపారు.
అశ్విని ఆసుపత్రిలో జరిగిన మెగా రక్తదాన శిబిరంలో టిటిడి సిబ్బంది, యాత్రికులు చురుకుగా పాల్గొన్నారు.
బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, అపోలో కార్డియాక్ సెంటర్ డాక్టర్ ప్రతాప్ పాల్గొన్నారు.
తిరుపతిలో…
అదేవిధంగా తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి లో గల కేంద్రీయ వైద్యశాల బ్లడ్ బ్యాంకులో 14 మంది రక్తదానం చేశారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్లు డాక్టర్ కావ్యశ్రీ, డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.