EARTHLY HEAVEN REPLICATED AT “EKASILANAGARAM” WITH ELECTRICAL ILLUMINATIONS  _ భూలోక స్వర్గం “ఏకశిలనగరం”

200 AIR COOLERS ARRANGED IN GALLERIES

VAJRA KIREETAM, THREE DIMENSIONAL VENKATESWARA ADD GRANDEUR

28 LED SCREENS FOR KALYANAM

VONTIMITTA, 20 APRIL 2024: The entire premises of Vontimitta Kodanda Ramalayam donned an “Earthly Paradise” look with the colourful electrical illuminations.

As a part of the annual Brahmotsavam in Ekasila Nagaram, TTD has made elaborate arrangements including flower decorations and electrical illuminations.

The entire temple complex, Kalyana Vedika are arranged with Truss lighting providing a special effect and giving an amazing look.

Seven big and 30 small electrical divine images were erected at the temple, Kalyana vedika, nearby roads connecting these places.

The big ones includes Lakshmi Venkateswara, Sita Rama, Sri Rama Pattabhishekam, Maha Vishnu, Viswarupam, Dasavatarams.

While the other important electrical diaromas includes Asta Lakshmis, Tumburu, Annamacharya etc.

In addition to that Gopuram lighting, Prakaram surrounding lighting, Sri Venkateswara Swamy Three-dimensional lighting, two electrical Diamond crowns one at the temple and another at Kalyana Vedika added the grandeur to the annual fete impressing devotees to a great extent.

Nearly 100 workers put efforts day and night for almost a month to make these divine electrical decors.

Others

For the sake of devotees, 28 LED TVs with two near the main Temple and 26 inside and surrounding Kalyana Vedika were also set ready for displaying the celestial Sita Rama Kalyanam on April 22 from 6:30pm and 8:30pm.

To have the best voice clarity, Radio and Broadcasting with Line Array Sound Mechanism has also been arranged. To keep the devotees cool from scorching temperatures in the galleries about 200 Air coolers were placed. On the main stage of Kalyana Vedika also A/C and Air coolers were arranged.

All these arrangements have been carried out in the direct supervision of SE Electrical Sri Venkateswarulu while DEs Sri Chandra Sekhar and Smt Saraswati monitored the arrangements by their respective team from time to time.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భూలోక స్వర్గం “ఏకశిలనగరం”

•⁠ ⁠ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు

– గ్యాలరీలలో 200 ఎయిర్ కూలర్‌లు ఏర్పాటు

– వజ్ర కిరీటం, త్రీ డైమెన్షనల్ వేంకటేశ్వరుడు

– కల్యాణం కోసం 28 ఎల్ ఈడి స్క్రీన్‌లు


ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 20: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో “భూమికి దిగివచ్చిన స్వర్గం” అన్నట్టు శోభను సంతరించుకుంది.

ఏకశిలానగరంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఎలక్ట్రికల్ గార్డెన్ విభాగాలు చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్‌ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ సముదాయం, కళ్యాణ వేదిక వద్ద అద్భుతమైన ట్రస్ లైటింగ్‌తో ఏర్పాటు చేశారు.

దేవాలయం, కల్యాణ వేదికలను కలుపుతూ రహదారుల వద్ద వివిధ దేవతామూర్తులతో కూడిన ఏడు పెద్ద, 30 చిన్న విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇందులో లక్ష్మీ వెంకటేశ్వర, సీతా రామ, శ్రీరామ పట్టాభిషేకం, మహా విష్ణువు, విశ్వరూపం, దశావతారాలు వంటి పెద్ద కటౌట్లు ఉన్నాయి.

అదేవిధంగా అష్టలక్ష్ములు తుంబురుడు అన్నమాచార్యులు వంటి చిన్న కటౌట్లు ఏర్పాటు చేశారు. గోపురం దీపాలంకరణ, ప్రాకారం చుట్టుపక్కల దీపాలంకరణ, శ్రీవేంకటేశ్వర స్వామి త్రీ డైమెన్షనల్ దీపాలంకరణ, ఆలయం వద్ద ఒకటి, కల్యాణ వేదిక వద్ద మరొకటి విద్యుత్ డైమండ్ కిరీటాల నమూనా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

దాదాపు 100 మంది కార్మికులు ఈ విద్యుత్ అలంకారాలను తయారు చేయడానికి నెల రోజుల పాటు పగలు రాత్రి శ్రమించారు.

ఏప్రిల్ 22న సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు సీతా రామ కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రధాన ఆలయానికి సమీపంలో రెండు మరియు కల్యాణ వేదిక లోపల, చుట్టుపక్కల 26 ఎల్ ఈ డి స్క్రీన్‌లు
సిద్ధంగా ఉన్నాయి.

అత్యుత్తమ ఆడియో కోసం, లైన్ అర్రే సౌండ్ మెకానిజంతో రేడియో మరియు బ్రాడ్ కాస్టింగ్ ఏర్పాటు చేయబడింది. భక్తులకు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించి చల్లగా ఉంచడానికి దాదాపు 200 ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. కల్యాణ వేదిక ప్రధాన వేదికపై కూడా ఏసీ, ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు.

ఈ ఏర్పాట్లను ఎస్ఈ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వరులు ప్రత్యక్ష పర్యవేక్షణలో డీఈలు శ్రీ చంద్రశేఖర్, శ్రీమతి సరస్వతి మరియు వారి బృందం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.