EFFECTIVE SECURITY MEASURES WITH LATEST TECHNOLOGY FOR TIRUMALA SOON- PRINICIPAL SECRETARY HOME _ ఆధునిక టెక్నాలజి సాయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : హోంశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ హరీష్ కుమార్ గుప్తా

SENIOR TTD AND POLICE OFFICIALS INSPECT SRIVARI TEMPLE AND OTHER LOCATIONS IN TIRUMALA

Tirumala,23 May 2023: Effective and foolproof initiatives will be taken up with latest technology to  strengthen the security set up in Tirumala soon, said the State Principal Secretary(Home) Sri Harish Kumar Gupta on Wednesday.

Speaking to media persons at Vaikuntha 2 Complex on Wednesday the top brass police official said the review of security measures was done for two days on how to roll out Artificial Intelligence steps at the CCTV control room with latest software besides anti-drone technology and body scanners.

DIG Sri Ammi Reddy said seven committees have been constituted with SP or ASP level officials as leads for a field study and report within 15 days. A review meeting will be held again and execute the decisions after the approval from the Government.

Earlier the high level officials team inspected thr Srivari temple, New Parakamani Bhavan, VQC 1&2, Command Control Room and other locations in Tirumala.

TTD JEO Sri Veerabrahmam, OSD(ISW) Sri Shashidhar Reddy, CVSO Sri Narasimha Kishore, Intelligence DP Sri Sumit, Greyhounds SP Sri Bindu Madhav, Commandant of 14th Battalion Sri Jagadeesh, Tirupati SP Sri Parameswar Reddy, top cops from State Intelligence Bureau, Intelligence Security Wing, Octopus, Forest, Fire services were also present.

Among TTD senior officers, CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, VGOs Sri Bali Reddy, Sri Manohar and Sri Giridhar Rao, DFO Sri Srinivasulu, GM IT Sri Sandeep and others were also present.

MEETING AT ANNAMAIAH BHAVAN

Thereafter senior officials from different uniform forces and TTD met at Annamaiah Bhavan in the review meeting jointly led by TTD CVSO Sri Narasimha Kishore and Intelligence SP Sri Sumit on Wednesday evening.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆధునిక టెక్నాలజి సాయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : హోంశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ హరీష్ కుమార్ గుప్తా
 
– శ్రీవారి ఆలయం సహా ముఖ్య ప్రాంతాల్లో టీటీడీ, పోలీసు ఉన్నతాధికారుల పరిశీలన
 
మే 24, తిరుమల, 2023: ఆధునిక టెక్నాలజి సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 వద్ద బుధవారం అయిన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్ లో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్వేర్లను వాడాలి అనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. అదేవిధంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు.
 
 డిఐజి శ్రీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఏస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏడు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేస్తారని, మరోసారి సమావేశమై సమీక్షిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారు.
 
అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి భద్రత అంశాలను తనిఖీ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో తిరుమలలో సిసి కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు.
 
టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఓఎస్డీ ఐఎస్ డబ్ల్యు శ్రీ శశిధర్ రెడ్డి, టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీ శ్రీ సుమిత్, గ్రేహౌండ్స్ ఎస్పీ శ్రీ బిందుమాధవ్, 14వ బెటాలియన్ కమాండెంట్ శ్రీ జగదీష్, తిరుపతి ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీసు, అటవీ, అగ్నిమాపక, ఇతర బలగాలకు చెందిన పలువురు అధికారులు, టీటీడీ సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ శ్రీదేవి, వీజీవోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మనోహర్‌, గిరిధర్‌రావు, జిఎం ఐటీ శ్రీ సందీప్ తోపాటు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.
 
అన్నమయ్య భవనంలో సమావేశం
 
 ఆ తరువాత మధ్యాహ్నం తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీ శ్రీ సుమిత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
 
ఈ సమావేశంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, బాంబుస్క్వాడ్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీసు, అటవీ, అగ్నిమాపక, ఇతర బలగాలకు చెందిన పలువురు అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. 
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.