EINSTEINS’S RELATIVITY THEORY IN 1000 YEAR OLD VEDIC BOOKS- TTD EO _ వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంధాల్లో ఐన్ స్టీన్ సిద్ధాంతం

·      VEDIC STUDIES SHOULD GRASP HINDI AND ENGLISH

 

·      TTD EO AT 17th FOUNDATION DAY CELEBRATIONS OF SV VEDIC UNIVERSITY

 

Tirupati,12 July 2022: TTD EO and Vice-Chancellor of SV Vedic University Sri AV Dharma Reddy has asserted that the famous Relativity Theory profound by renowned scientist Albert Einstein has mentioned in various Vedic texts and Puranas some thousands of years ago itself.

 

Addressing during the 17th foundation day celebrations of the SV Vedic Varsity the TTD EO said the Uttarayana and Dakshinayana analysis emerged much earlier than Einstein findings.

 

Earlier he participated in the celebrations on Tuesday and attended the  Purnahuti fete of the Navagrahamakha Sri Sudarshan Paramatmaka Yagam held at SVVedic university grounds.

 

TTD EO exhorted that the Vedic students to achieve proficiency in English and Hindi to reach out knowledge and technology bases across the world and become ambassadors of intellect.

 

He said he learnt a lot from the Vedic pundits committee formed during the Covid-19 season and averred that Vedic studies were tougher than medical studies.

 

Among others, he highlighted the impact of Vedic and puranic studies like Nava Graha etc. on peace, nature, and humanity and urged students to practise Yoga daily.

 

A new VC would soon be appointed to the SVV university.

 

Chief Guest Dr Lakshmi Prasanna Anjaneya Sharma from Puducherry University and TTD JEO (E&H) Smt Sada Bhargavi also spoke.

 

Thereafter the TTD EO presented books and pattu vastrams to students. He also unveiled the Academic calendar of year 2022-23 and the Brahma Gosha CD prepared by the late Agnigundam Srinivasacharyulu.

 

University Registrar Acharya Radhe Shyam, Dean Dr Phani Yajneswara  Yajulu, Acharya Phani Kumar and SVBC CEO Sri Shanmukha  Kumar were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంధాల్లో ఐన్ స్టీన్ సిద్ధాంతం

– వేద విద్యార్థులు ఆంగ్లం, హింది లోనూ పట్టు సాధించాలి

ఎస్వీ వేద విశ్వవిద్యాలయం 17వ వార్షికోత్సవ సభలో టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి

తిరుపతి 12 జులై 2022: ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంథాలు, పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తుందని టీటీడీ ఈవో, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ఉత్తరాయణం, దక్షిణాయనం లాంటి లెక్కలు ఈ కోవలోకే వస్తాయన్నారు.

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 17వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నవగ్రహ మఖ శ్రీ సుదర్శన పారమాత్మక యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో శ్రీ ధర్మారెడ్డి వేద విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. వేద విద్య అభ్యసిస్తున్న వారు ఆంగ్లం, హింది భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలన్నారు.ఇలా నేర్చుకోగలిగితేనే వేద విద్య ను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసే రాయబారులుగా రాణించవచ్చని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎస్వీబీసీ ద్వారా మంచి కార్యక్రమాలు రూపొందించి, ప్రసారం చేయడం కోసం వేద పండితులతో కమిటీ నియమించామన్నారు. ఆ సమయంలో తాను వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలిగే అవకాశం లభించిందని ఆయన వివరించారు. వైద్య విద్య కంటే వేద విద్యాభ్యాసం చాలా కష్టమన్నారు. వేద విద్య ఒక మతానికి సంబంధించినది కాదన్నారు.నవగ్రహాల గురించి కూడా వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంథాలు, పురాణాలలో చెప్పడం జరిగిందన్నారు. నవగ్రహాల ప్రభావం, వాటి శాంతి మార్గాలు, మానవుల మీద వాటి ప్రభావం కూడా వివరించారని ఈవో చెప్పారు. వేద విద్యార్థులు రోజు యోగాభ్యాసం చేయాలని, దీనివల్ల శరీరాన్ని నియంత్రిచుకోవచ్చని సూచించారు. వేద విద్యార్థులు రాగ ద్వేషాలకు అతీతులుగా తయారై సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. వేద విశ్వవిద్యాలయానికి త్వరలోనే కొత్త విసి నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

ముఖ్య అతిథిగా హాజరైన పుదుచ్చేరి విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఆంజనేయ శర్మ మాట్లాడుతూ, వేద విద్యార్థులు వేదం లోని లోతు తెలుసుకుని అభ్యాసం చేస్తే ఉత్తమంగా తయారవుతారని చెప్పారు. వేద విద్య ను కేవలం ఉద్యోగం కోసం కాకుండా బుద్ధి శక్తి, నైపుణ్యం పెంచుకుంటేనే ఉపయోగం ఉంటుందని సలహా ఇచ్చారు. మహానుభావులను సేవించి విజ్ఞానం సంపాదించాలన్నారు.

జెఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, వేద విద్యకు భరత భూమి పుట్టినిల్లని చెప్పారు.అలాంటి వేద విద్యను పరిరక్షించే కార్యక్రమం టీటీడీ నిర్వహిస్తోందన్నారు. కలియుగంలో ధర్మం విశిష్టత కేవలం వేదం చదివిన వారే చెప్పగలరని ఆమె తెలిపారు. ప్రపంచంలోని ఏ శక్తి వేద విద్యను మన నుంచి కొల్లగొట్టలేక పోయిందని తెలిపారు.
అనంతరం ఈవో, ఇతర అథితులు విద్యార్థుల కు పుస్తకాలు, వస్త్ర బహుమానం చేశారు. 2022-23 అకడమిక్ క్యాలెండర్, స్వర్గీయ అగ్నిగుండం శ్రీనివాసాచార్యులు వేద విశ్వవిద్యాలయం రికార్డింగ్ ప్రాజెక్టులో రూపొందించిన బ్రహ్మ ఘోష సిడి ని ఆవిష్కరించారు.

విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యామ్, డీన్ డాక్టర్ ఫణి యజ్ఞేశ్వర యాజులు, ఆచార్య పవన్ కుమార్ ప్రసంగించారు. ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది